Published : 22/04/2021 00:28 IST

సూపర్‌విమెన్‌కు ఆహారం!

మహిళలు ఆరోగ్యంగా, మరింత శక్తిమంతంగా మారాలంటే ఆహారం కూడా చాలా బలవర్థకంగా ఉండాలి. అందుకు ఏం తీసుకోవాలంటే...
మీగడ లేని పెరుగు... దీంట్లో శరీరానికి మేలు చేసే ప్రోబ్యాక్టీరియాతో పాటు క్యాల్షియం మెండుగా ఉంటుంది. ఎక్కువ పనులు చేసే మహిళలకు ఎముక సామర్థ్యం బాగుండాలి కదా! అందుకే రోజూ పెరుగు తీసుకోవాలి.

చేపలు... వీటిలోని ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు శరీరంలోని ప్రతి అణువుకూ ఆరోగ్యాన్నిస్తాయి. అలాగే ప్రొటీన్‌ కూడా మేలు చేస్తుంది. క్రమం తప్పకుండా తీసుకుంటే గుండెజబ్బులు, హైపర్‌ టెన్షన్‌, ఒత్తిడి, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఈ ఫ్యాటీ ఆమ్లాలుండే వాల్‌నట్స్‌, అవిసె గింజలనూ తీసుకుంటే మరింత మంచిది.

టొమాటోలు... వీటిలో లైకోపిన్‌ అనే పోషకం పుష్కలంగా ఉంటుంది. దాంతోపాటు విటమిన్‌-సి కూడా. టొమాటోను తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్‌ వంటి వ్యాధులను కొంతవరకు నిరోధించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి.  

ఆకుకూరలు... ముదురు ఆకుపచ్చ రంగుల్లోని ఆకుకూరల్లో విటమిన్‌-ఎ, సి సమృద్ధిగా ఉంటాయి. అలాగే క్యాల్షియం కూడా. ఇవి కంటికి, ఎముకల బలానికి, జీర్ణక్రియకు సాయపడతాయి.

ఎండు ఫలాలు... రోజూ గుప్పెడు డ్రైఫ్రూట్స్‌ తింటే ఆరోగ్యం మీ సొంతమవుతుంది. ఇవి ఆకలిని నియంత్రించడమే కాకుండా తీపి తినాలనే ఆలోచననూ తగ్గిస్తాయి. వీటిలోని ‘ఫైటో ఈస్రోజెన్స్‌’ హార్మోన్ల సమతౌల్యానికి ఉపకరిస్తాయి. స్త్రీలలో పునరుత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతాయి.  ఎండిన ఖర్జూర, ఆప్రికాట్స్‌, నేరెడు పళ్లలో ఫైటో ఈస్ట్రోజెన్‌ అధికం. కాబట్టి వీటిని తప్పక తీసుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి