Published : 28/04/2021 01:18 IST

చక్కటి బుద్ధులు నేర్పండి!

చిన్నారులు కావాల్సింది సాధించుకోవడం కోసం ఏడుపు, అరుపులనే ఆయుధంగా చేసుకుంటారు. వారలా ఏడుస్తుంటే తల్లి హృదయం ఊరుకోదు. దాంతో చిన్నారి అడిగిన దానికి సరేనంటుంది. ఇదిలా ఎప్పుడైనా ఒకసారి అయితే ఫర్వాలేదు కానీ... అలవాటైతే తన భవిష్యత్తును మీరే చేజేతులా పాడు చేసినవారవుతారు.

పిల్లలు పెరుగుతున్న క్రమంలో వారికి అన్ని విషయాల్లో క్రమశిక్షణ నేర్పడం తప్పనిసరి. మీ చిన్నారి ప్రవర్తన బాగోనప్పుడు సరిగా నడుచుకోవాలంటూ చిన్నగా మందలించవచ్చు. ‘నువ్విలా ప్రవర్తిస్తే నీతో మాట్లాడను’ అంటూ మీరు హెచ్చరిస్తారు. తర్వాత పాపాయి అమాయకపు మోము కనిపించగానే మీరన్న మాట మర్చిపోయి ముద్దులాడారనుకోండి మీ పట్ల తను తేలిక భావం ఏర్పరుచుకుంటుంది. అమ్మా నాన్న అంతేలే అనుకుంటుంది.

* ‘నువ్వు హోమ్‌ వర్క్‌ చేస్తేనే... నీకు సైకిల్‌ కొనిపెడతా’ ఇలా రకరాల తాయిలాలను పిల్లలకు చూపుతుంటారు. ఇలా చిన్నప్పటి నుంచి లంచాల్లాంటివి అలవాటు చేయొద్దు. ప్రశంసలు, బహుమతులకు కచ్చితమైన తేడాను వారికి తెలియజేయాలి.

* కొంతమంది చిన్నారులు తల్లిదండ్రులంటే గౌరవం లేకుండా మాట్లాడుతుంటారు. పేరెంట్స్‌ ఏమో చిన్నపిల్లలే కదా తర్వాత మానేస్తారని ఊరుకుంటారు. ఇలా చేస్తే మీరే పరోక్షంగా వారిని ప్రోత్సహించినట్లు అవుతుంది. చిన్నారి తప్పుగా మాట్లాడిన ప్రతిసారీ ఆమెను/ అతడిని అలా మాట్లాడకూడదని కాస్త గట్టిగానే చెప్పండి. అలా ప్రవర్తించడం మర్యాద కాదని ఆ చిట్టి బుర్రలకు అర్థమయ్యేలా వివరించండి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి