Published : 04/05/2021 00:30 IST

వంటింటిని మార్చేద్దాం!

జ్యోత్స్న వంటింటిని అందంగా సర్దుకోవాలనుకుంటుంది.  అయితే ఎటుచూసినా మాసిపోయిన ప్లాస్టిక్‌, జిడ్డు పట్టేసిన స్టీలు డబ్బాలే అలమరల్లో కనిపిస్తున్నాయి. వాటిని ఒకసారి కడిగి పెట్టినా, తిరిగి అతి కొద్ది రోజులకే మాసిపోతున్నాయి. ఏం చేయాలో ఆమెకు తెలియడం లేదు. ప్రస్తుతం ఎకో ఫ్రెండ్లీ అనే పదాన్ని వింటున్న జ్యోత్స్న  తన వంటిల్లును అలాగే  మార్చుకోవాలనుకుంటోంది. ఈ తరహా ఆలోచనలున్న మహిళలకు నిపుణులు కొన్ని సూచనలిస్తున్నారు. వాటిని పాటించి అమలు చేస్తే చాలు, వంటిల్లంతా నందనవనంలా మారిపోతుందంటున్నారు. ఆరోగ్యమే కాదు, రకరకాల పోషక విలువలుండేలా వంటలు చేయాలనే ఆసక్తీ.. పెరుగుతుందని చెబుతున్నారు.
పాత్రలు... సెరామిక్‌, గాజు పాత్రలను ఎంపిక చేసుకోవాలి. ప్రస్తుతం మట్టి పాత్రల్లో వండటం కూడా ఆరోగ్యకరమే అంటున్నారు వైద్యులు. ఈ పాత్రలపై మూతలు ప్రస్తుతం సిలికాన్‌లో దొరుకుతున్నాయి. అలాగే  వీలైనంత చెక్క గరిటలనే వాడాలి. పాలు, పెరుగు వంటివాటికి పింగాణీ పాత్రలైతే మంచిది. ఫ్రిజ్‌లో ఉంచడానికి ఇవి అనువుగానూ ఉంటాయి.
కాటన్‌ బ్యాగులు... కూరగాయలు, ఇంటికి కావాల్సిన నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయడానికి ఆర్గానిక్‌ కాటన్‌ బ్యాగులను వినియోగించడం మంచిది. ఫ్రిజ్‌లో కూరగాయలను నిల్వ ఉంచేటప్పుడు ప్లాస్టిక్‌ సంచుల్లో కాకుండా కాటన్‌ బ్యాగుల్లోనే విడివిడిగా భద్రపరుచుకోవాలి. అలాగే  కొత్తిమీర, కరివేపాకు, ఆకుకూరలు వంటివాటిని కవర్లలో కాకుండా సిలికాన్‌ డబ్బాల్లో అడుగున, పైన టిష్యూ కాగితాన్ని వేసి మధ్యలో వీటిని ఉంచితే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి.
తడి, పొడి చెత్త... వంటింట్లో తడి, పొడి చెత్తలకు విడివిడిగా రెండు చెత్తబుట్టలను అమర్చుకోవాలి. కూరగాయలు, పండ్ల వ్యర్థాలు, కోడిగుడ్డు పెంకులు వంటివాటిని తడిచెత్తలో చేర్చాలి. ఆ తర్వాత వీటిని తోటమొక్కలకు ఎరువుగా వాడుకోవచ్చు. గిన్నెలను శుభ్రం చేయడానికి వినియోగించే లిక్విడ్స్‌ను రసాయనరహితంగా తయారుచేసిన వాటిని ఎంచుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి