Published : 05/05/2021 00:35 IST

ఉదాసీనత వద్దే వద్దు

ఇంట్లో అనుబంధాలే కాదు.. అపార్థాలు, అపోహలు, ఒడుదొడుకులు సహజం. వాటిని సరిదిద్దుకోవాలంటే... కొన్ని జాగ్రత్తలు అవసరం...
ఆలోచనా ముఖ్యమే: ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకున్నప్పుడే అపార్థాలు తొలగి ఆనందాలు వెల్లివిరుస్తాయి. ఏదైనా చెబితే...ఆలోచించకుండా మాట్లాడేయొద్దు. ఆచితూచి మాట్లాడితే ఇద్దరి మధ్యా దూరం పెరగదు. ఒకవేళ మీరే కఠినంగా మాట్లాడి ఉంటే క్షమాపణ అడగడానికీ వెనుకాడకండి.
ఎత్తిచూపవద్దు: అన్నీ మనకే తెలుసనే భావనో లేక అవతలివారికంటే ఎక్కువనే అపోహతోనో కొందరు ఆలుమగలు తరచూ ఒకరినొకరు ఎత్తిచూపుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో గాయపడిన మనసుని గుర్తించకుండా...తమ తీరే సరైనదని వాదిస్తుంటారు. దీనివల్ల తాత్కాలికంగా మీ అహం సంతృప్తి పడొచ్చు. దీర్ఘకాలంలో మాత్రం మీ అనుబంధం బలహీనపడే ప్రమాదం ఉంది. ఎదుటివారి ఇష్టాయిష్టాలను గౌరవిస్తేనే సంతోషాలు వెల్లివిరుస్తాయి.
ప్రాధాన్యం అవసరం: మన ఇంటి మనిషే కదా! అంటూ భాగస్వామికి ప్రాధాన్యం ఇచ్చే విషయంలో, సమయం కేటాయించే విషయంలో ఉదాసీనత చూపించొద్దు. ఎంత తీరిక లేకుండా ఉన్నా... సమయం కేటాయించండి. వేడుకలు, ఇతర సందర్భాల్లో మీ తోడుకి తగిన ప్రాధాన్యం ఇవ్వండి. ఇవన్నీ మీపై అనురాగాన్ని పెంచుతాయి.

వినడమెంతో మేలు:

భాగస్వామి ఏదైనా చెబుతుంటే కొట్టిపారేయొద్దు. వారు చెబుతుంటే నీకేమీ తెలియదంటూ నిర్లక్ష్యం ప్రదర్శించవద్దు. మీరు ఎంత పనిలో ఉన్నా...అవతలివ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఒక నిమిషం ఆగి వినండి. అప్పుడే వారి భావాన్ని సరిగా అర్థం చేసుకోగలరు. లేదంటే...మీ తీరు సమస్యలకు మూలం కావొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి