Published : 05/05/2021 00:35 IST

పరువుకోసమే పెళ్లి చేసుకున్నాడట?

మా పెళ్లయి రెండేళ్లవుతోంది. ఇప్పటివరకూ అతడు నాతో సంసారం చేయలేదు. గట్టిగా నిలదీస్తే... పరువు కోసమే పెళ్లి చేసుకున్నానని చెప్పాడు.  ఇంట్లో వాళ్లతో చెప్పాలని ప్రయత్నిస్తే... నీకే మరొకరితో అక్రమ సంబంధం ఉందని చెబుతా అని బెదిరించాడు. నేను ఆలోచనల్లో ఉండగానే ఉద్యోగం పేరుతో విదేశాలకు వెళ్లిపోయాడు. అత్తమామలు నన్ను కుటుంబ సభ్యురాలిగా ఏ రోజూ చూడలేదు. వేధించి ఇంట్లో నుంచి గెంటేశారు. ఇప్పుడు అతడిని రప్పించాలన్నా, నాకు న్యాయం జరగాలన్నా ఏం చేయొచ్చు?

- ఓ సోదరి, వరంగల్లు

తడికి ఉన్న లోపాన్ని దాచిపెట్టి పెళ్లి చేశారని, అందుకే ఆ పెళ్లి చెల్లదని మీరు హిందూ వివాహచట్టంలోని సెక్షన్‌ 12(1)ఎ ప్రకారం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయవచ్చు. నల్లిటీ కింద సాధారణంగా పెళ్లయిన సంవత్సరం లోపు లేదా నిజం తెలిసిన సంవత్సరంలోపు దావా వేయాలి. కానీ ప్రస్తుతం అలా కోరుకోవడం వల్ల మీకు వచ్చే లాభమేమీ లేదు. ముందు మీ అత్తింటివారిపై గృహహింస చట్టాన్ని ఉపయోగించి కేసు వేయండి. కోర్టు నోటీసు లేదా నాన్‌బెయిలబుల్‌ అరెస్ట్‌ ఉంటే మీ భర్తని విదేశాల నుంచి రప్పించడానికి ప్రయత్నించొచ్చు.
మీరు అతనితో పాటు అతని బంధువుల మీద క్రిమినల్‌ ఫిర్యాదు ఫైల్‌ చేయండి. సెక్షన్‌ 156(3)సీఆర్‌పీసీ ప్రకారం మీరు ఫైల్‌ చేసిన ఫిర్యాదు మీద మెజిస్ట్రేట్‌ కాగ్నిజెన్స్‌ తీసుకుని అతనిమీద అరెస్ట్‌ వారెంట్‌ ఇష్యూ చేస్తే...దాన్ని పాస్‌పోర్టు అథారిటీ వాళ్లకు పంపించొచ్చు. అతని పాస్‌పోర్టుని రద్దు చేయమని కోరవచ్చు. పాస్‌పోర్టు చట్టంలోని సెక్షన్‌ పది ప్రకారం ఎవరైనా వ్యక్తి మీద నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌, నేర నిరూపణ అయితే కనుక కన్విక్షన్‌ ఆర్డరు, కోర్టు సమన్లు వంటివేవైనా జత చేసి పాస్‌పోర్టు రద్దు చేయమని అడగొచ్చు. అవే కారణంగా చూపించి వీసానూ క్యాన్సిల్‌ చేయించమని దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం ఎంబసీనీ సంప్రదించొచ్చు. ఈ సమస్యను జాతీయ మహిళా కమిషన్‌ దృష్టికి కూడా తీసుకెళ్లొచ్చు. వీరు ఎన్‌ఆర్‌ఐ పెళ్లి బాధితుల కోసం ఓ సెల్‌ని ఏర్పాటు చేశారు. మీ ఫిర్యాదు కాపీ ఆధారంగా వారు సంబంధిత వ్యక్తులకు నోటీసులు పంపిస్తారు. మంచి లాయర్‌ను సంప్రదిస్తే  సమస్య నుంచి త్వరగా బయటపడగలరు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి