దారాలు చెప్పే.. ఊసులు!
అమ్మమ్మల కాలంనాటి.. కుట్టుపనికి తన సృజనాత్మకతతో ఆధునికతని అద్ది.. కొత్తందాలు తీసుకొచ్చింది ప్రియశ్రీకుమార్. దాంతో ఆమె అభిరుచి కాస్త వ్యాపారంగా మారింది...
అమ్మమ్మల కాలంనాటి.. కుట్టుపనికి తన సృజనాత్మకతతో ఆధునికతని అద్ది.. కొత్తందాలు తీసుకొచ్చింది ప్రియశ్రీకుమార్. దాంతో ఆమె అభిరుచి కాస్త వ్యాపారంగా మారింది...
రంగురంగుల దారాలని ముందేసుకుని... వాటితో చక్కని ఎంబ్రాయిడరీ డిజైన్లు తీర్చిదిద్ది స్నేహితులకి, తెలిసిన వారికి కానుకలుగా ఇవ్వడం కేరళకి చెందిన ప్రియశ్రీకుమార్ అభిరుచి. ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడు ఏమాత్రం తీరిక దొరికినా సాయంత్రం పూట ఎంబ్రాయిడరీ సొగసులు అద్దిన కీచెయిన్లని, ఫ్రేములని తయారుచేసేది. తర్వాత రోజు వాటిని స్నేహితులకి కానుకలుగా ఇచ్చేది. కొన్నిరోజులు పోయిన తర్వాత వాళ్లే ‘భలే ఉంది. మరొకటి చేసిస్తావా’ అని అడగడం మొదలుపెట్టాక ప్రియ నైపుణ్యానికి డిమాండ్ పెరిగింది. దాంతో ఇంజినీరింగ్ అయిపోయిన తర్వాత ఈ పనినే తన కెరీర్‌గా ఎంచుకుంది. సెలబ్రిటీల దుస్తులపై ప్రత్యేకంగా ఎంబ్రాయిడరీ వర్క్ చేయడం, ఫొటోలు ఇస్తే వాటిని దారాలతో అచ్చంగా కాన్వాస్‌పై దింపేయడం ప్రియ ప్రత్యేకత. కేరళ ఆరోగ్యమంత్రి శైలజతో సహా ఎందరో ప్రముఖులని దారాలతో కాన్వాస్‌పై అద్భుతంగా ఆవిష్కరించింది. ఆ అందాలని మీరూ చూసేయండిక్కడ.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.