ఈ నూనెలతో జుట్టుకు మేలు!

ఏ నూనె పెడితే జుట్టు చక్కగా పెరుగుతుందా అని చూస్తుంటాం. ఇదిగో కొన్ని రకాల నూనెలతో మన జుట్టును కాపాడుకోవచ్చు. మరి కొన్నింటిని మనమే తయారు చేసుకోవచ్చు. ఎలానో చూద్దాం రండి...

Published : 13 May 2021 00:16 IST

ఏ నూనె పెడితే జుట్టు చక్కగా పెరుగుతుందా అని చూస్తుంటాం. ఇదిగో కొన్ని రకాల నూనెలతో మన జుట్టును కాపాడుకోవచ్చు. మరి కొన్నింటిని మనమే తయారు చేసుకోవచ్చు. ఎలానో చూద్దాం రండి...


వేపతో...
ఇది మార్కెట్‌లో లభ్యమైతుంది. దీన్ని కొబ్బరి నూనెలో కలిపి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దురద, ఇన్ఫెక్షన్‌ల నివారణకు బాగా ఉపయోగపడుతుంది. జుట్టు తెల్లబడటం, చుండ్రు, కళ్లమంట, జుట్టు చివర్లు చిట్లి పోవడాన్ని నివారిస్తుంది.

అలోవెరా..
ఒక పెద్ద కలబంద ఆకు తీసుకుని నిలువుగా చీల్చాలి. గుప్పెడు మెంతుల్ని చీల్చిన ఆకు మధ్యలో పోయాలి. ఆ తర్వాత ఆకుల్ని యథావిధిగా మడిచి దారం కట్టి ఒక రోజంతా ఉంచాలి. మరుసటి రోజు ఆ గుజ్జును మెంతుల్ని కలిపి మిక్స్‌ చేయాలి. ఆ మిశ్రమాన్ని కొబ్బరి నూనెలో కలిపి ముదురు రంగు వచ్చేవరకు వేడి చేయండి. దాన్ని చల్లార్చి సీసాలో భద్రపరచండి. దీన్ని వారానికి 2 - 3 రోజులు జుట్టుకి పట్టించి, మాడుకు మర్దన చేయండి. క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే జుట్టు ఒత్తుగా పెరగడమే కాదు, మృదువుగానూ ఉంటుంది.
ఉసిరితో...
ఉసిరి రసం, గుంటగలగరాకు, పాలు సమపాళ్లలో తీసుకుని,  ఆ మిశ్రమాన్ని కొబ్బరినూనెలో కలిపి వేడి చేయండి. నీరు పోయి నూనె మిగిలే వరకూ కాయాలి. చల్లార్చిన తర్వాత మాడుకు పట్టించండి. ఈ విధంగా చేస్తూ ఉంటే మాడు చల్లబడి, జుట్టు దృఢంగా మారుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్