ఏఐతో తక్షణ రక్షణ!

మన ధ్యాసలో మనముంటాం. ఆలోచనల్లో మునిగిపోతాం. లేదంటే ఫోనులో బిజీగా ఉంటాం. కానీ కొన్ని కళ్లు మనల్నే పరిశీలిస్తున్నాయని, సమయం వచ్చినప్పుడు కాటేయడానికి సిద్ధంగా ఉన్నాయని గమనించుకోం. బస్టాండుల్లో... రైల్వేస్టేషన్లలో, ఇతర జనావాసాల్లో ఉన్నప్పుడు మన చుట్టూ ఏం జరుగుతుందో పరికించుకోవడం చాలా అవసరం.

Published : 13 May 2021 00:22 IST

మన ధ్యాసలో మనముంటాం. ఆలోచనల్లో మునిగిపోతాం. లేదంటే ఫోనులో బిజీగా ఉంటాం. కానీ కొన్ని కళ్లు మనల్నే పరిశీలిస్తున్నాయని, సమయం వచ్చినప్పుడు కాటేయడానికి సిద్ధంగా ఉన్నాయని గమనించుకోం. బస్టాండుల్లో... రైల్వేస్టేషన్లలో, ఇతర జనావాసాల్లో ఉన్నప్పుడు మన చుట్టూ ఏం జరుగుతుందో పరికించుకోవడం చాలా అవసరం. ఆ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. అయితే ఈ సమస్యకు యూపీ ప్రభుత్వం కృత్రిమమేధ సాయంతో చక్కని పరిష్కారాన్ని అందిస్తోంది. మహిళలు అధికంగా ఉండే ప్రాంతాల్లో కృత్రిమ మేధ]తో పనిచేసే సీసీ కెమెరాలని అమరుస్తోంది. ఈ కెమెరాలు అమ్మాయిలపై దాడిచేయడానికి లేదా, అపహరించడానికి ఎవరైనా ప్రయత్నిస్తున్నా... లేదా అమ్మాయిలు ఆందోళనలో, కంగారు, బాధలో ఉన్నా వారి ముఖకవళికల ఆధారంగా వారిని గుర్తించి ఆ సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తాయి. ఆకతాయిల కారణంగా ఇబ్బంది పడుతున్న అమ్మాయిలకు.. ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండానే కంట్రోల్‌రూమ్‌ నుంచి తక్షణ సాయం అందుతుంది. ‘మిషన్‌ శక్తి’ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించిన ప్రభుత్వం లఖ్‌నవూలో ఇప్పటి వరకూ 200 ఏఐ కెమెరాలని ఏర్పాటు చేసింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్