అరికాళ్ల మంటలకు చెక్‌ పెట్టేద్దాం

చాలామంది అరికాళ్ల మంటలతో బాధపడుతుంటారు. మంట వల్ల రాత్రిళ్లు నిద్రపట్టక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికోసమే ఈ చిట్కాలు..  

Updated : 13 May 2021 05:23 IST

చాలామంది అరికాళ్ల మంటలతో బాధపడుతుంటారు. మంట వల్ల రాత్రిళ్లు నిద్రపట్టక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికోసమే ఈ చిట్కాలు..  
ఎన్నో కారణాలతో అరికాళ్ల మంటలు వస్తాయి. తగ్గించుకోవాలంటే గోరు వెచ్చని నీటిలో అరికాళ్లను ముంచితే ఉపశమనం కలుగుతుంది. అలానే అందులో కాస్త ఉప్పు కలిపితే పాదాల నొప్పులు కూడా తగ్గుతాయి.
* అల్లం రసంలో కొబ్బరినూనె కలిపి ఆ మిశ్రమాన్ని పాదాలకు మర్ధనా చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే రక్త ప్రసరణ మెరుగై పాదాల మంట తగ్గుతుంది.
* వాకింగ్‌, జాగింగ్‌, రన్నింగ్‌ వంటి వ్యాయామాలను రెగ్యులర్‌గా చేయడం వల్ల అరికాళ్ల మంటలు తగ్గుముఖం పడతాయి.

*చేపలు, ఆకుకూరలు, పాల ఉత్పత్తులు, నట్స్‌, అవిసెగింజలు వంటివి ఆహారంలో భాగం చేసుకుంటే పాదాల మంటలు రాకుండా ఉంటాయి.

ఏసీతో జాగ్రత్త!

వేసవికాలం కదాని ఏసీలో గంటల తరబడి గడుపుతున్నారా? అయితే అది ఆరోగ్యానికి అంతమంచిది కాదని హెచ్చరిస్తున్నారు వైద్యులు.
* ఏసీ గదుల్లో తేమశాతం తక్కువగా ఉండటంతో డీ హైడ్రేషన్‌ సమస్య వస్తుంది. దాంతో తలనొప్పి, అది కాస్తా  మైగ్రేన్‌కి దారి తీస్తుంది.
* ఏసీలో ఉండేవారికి చర్మం పొడిబారుతుంది. ఆ చల్లని వాతావరణంలో కూర్చుని ఒకేసారి ఎండలోకి వెళితే ఈ సమస్య ఇంకా పెరుగుతుంది. కళ్లు పొడిబారే సమస్య ఉన్నవాళ్లు అసలు ఏసీలో ఉండకూడదు.
* ఎక్కువసేపు అదేపనిగా ఉన్నా ముక్కు, గొంతు వంటి శ్వాసకోశ వ్యాధులొస్తాయి. చల్లటి గాలిలోని తేమ వల్ల బ్యాక్టీరియా వృద్ధిచెంది ఇన్‌ఫెక్షన్‌ బారిన పడతారు. ఆస్తమా, సైనస్‌, అలర్జీలు ఉన్నవారు ఏసీలో ఉండకపోవడమే ఉత్తమం.

 

మొక్క ఆరోగ్యానికి...

మొక్కలకు తగినంత శక్తి అందాలంటే...అరటి తొక్కల్ని కొన్నిరోజుల పాటు నీళ్లలో నాననివ్వాలి. తర్వాత ఆ నీటిని వాటికి పోయాలి. ఇలా చేస్తే పొటాషియం, ఫాస్ఫరస్‌, క్యాల్షియం వంటి పోషకాలన్నీ అందుతాయి. చీడపీడల బెడద ఉండదు.
 

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్