పిల్లలు..క్షేమమిలా

కొత్తగా తల్లులైన వారికి ప్రతిదీ కంగారే! మంచం మీద పడుకోబెట్టి అలా పక్కకు వెళ్లారో లేదో దొర్లుతూ కింద పడతాడేమోననే భయం. పాకుతుంటే నేల రాసుకుంటుందేమో అనుమానం. నేర్చుకునే క్రమంలో ఇవన్నీ సహజమే అయినా.. వారికి తగిలే చిన్న దెబ్బ ఆమె ప్రాణం విలవిలలాడేలా చేస్తుంది. వారూ ఇలాంటివే అనుభవించారో ఏమో.. తయారీదారులు వీటికి తగ్గ యాక్సెసరీలను తయారు చేశారు.

Published : 13 May 2021 00:41 IST

కొత్తగా తల్లులైన వారికి ప్రతిదీ కంగారే! మంచం మీద పడుకోబెట్టి అలా పక్కకు వెళ్లారో లేదో దొర్లుతూ కింద పడతాడేమోననే భయం. పాకుతుంటే నేల రాసుకుంటుందేమో అనుమానం. నేర్చుకునే క్రమంలో ఇవన్నీ సహజమే అయినా.. వారికి తగిలే చిన్న దెబ్బ ఆమె ప్రాణం విలవిలలాడేలా చేస్తుంది. వారూ ఇలాంటివే అనుభవించారో ఏమో.. తయారీదారులు వీటికి తగ్గ యాక్సెసరీలను తయారు చేశారు.

*హెడ్‌ ప్రొటెక్టర్‌: అప్పుడే కూర్చోవడం మొదలు పెట్టేటపుడు, అడుగులు వేసేటపుడు పిల్లలు ఒక్కసారిగా వెనక్కిపడి దెబ్బ తగిలించుకుంటుంటారు. దీన్ని పిల్లల తల, భుజాలు గాయపడకుండా ఉండేలా తయారు చేశారు. పిల్లల భుజాలకు అమరిస్తే చాలు. బిగుతుగా లేకుండా వారికి అనుకూలంగా ఉండేలా రూపొందించారట.


* సేఫ్టీ బెడ్‌ రెయిల్స్‌: మంచానికి మూడు వైపులా ఏర్పాటు చేసుకోవచ్చు. సులువుగా అమర్చుకునే వీలుంటుంది. పాపాయి పట్టుకుని నిల్చున్నా పడకుండా మందంగానూ ఉంటాయి. అవసరాన్ని బట్టి ఎత్తును మార్చుకునే సౌకర్యమూ ఉంటుంది.


* నీ సపోర్ట్‌ ప్రొటెక్టర్‌: పాకేటపుడు, అప్పుడే అడుగులు వేసేటపుడు కిందపడినా బుజ్జాయి మోకాళ్ల చర్మం దెబ్బతినకుండా ఉండటానికి వీటిని ఉపయోగించొచ్చు. సాక్సు మాదిరిగా మోకాలి వరకూ లాగేస్తే సరి! నడవడంలోనూ పాకడంలోనూ ఇబ్బంది లేకుండా చెమటను సైతం పీల్చుకునేలా వీటిని తయారు చేశారు.


* సేఫ్టీ క్యాబినెట్‌ లాక్‌: బుడి బుడి అడుగులు వేసేటపుడు పిల్లలు అందిన ప్రతిదాన్నీ ఆసరాగా తీసుకునే ప్రయత్నం చేస్తారు. అవి ఒక్కసారిగా తెరుచుకుంటే దెబ్బ తగిలించుకోవడమో, కింద పడటమో జరుగుతుంటుంది. ఈ సమస్యలకు పరిష్కారమే ఇది. ఒకసారి అమరిస్తే గట్టిగా లాగినా ఊడిరావు. పెద్దలు లాక్‌ను ఓపెన్‌ చేస్తే చాలు.


* డోర్‌ గార్డ్‌: తలుపు వేసేటపుడో, అనుకోకుండానో వేళ్లు నలగ్గొట్టేసుకుంటారు. వీటిని తలుపుకు అమరిస్తే తలుపు పడినా పిల్లల చేతులు సురక్షితంగా ఉంటాయి. అవసరం లేదనుకున్నపుడు తీసేస్తే సరి!


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్