చల్లని స్ప్రేలు చల్లుకుంటే...

ఎండలో బయటకు వెళ్లినప్పుడు ఎక్కువ ఉక్కగా అనిపించడం సహజం. ఇటువంటి సమయాల్లో ముఖంపై చల్లచల్లని స్ప్రే చల్లుకుంటే చాలు.

Published : 14 May 2021 00:23 IST

ఎండలో బయటకు వెళ్లినప్పుడు ఎక్కువ ఉక్కగా అనిపించడం సహజం. ఇటువంటి సమయాల్లో ముఖంపై చల్లచల్లని స్ప్రే చల్లుకుంటే చాలు. ముఖం తాజాగా మారుతుంది. బయట కొనే స్ప్రేలలో రసాయనాలు ఉండొచ్చు. వీటివల్ల పలురకాల ఎలర్జీలకు గురికావచ్చు. అందువల్ల వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చంటున్నారు  సౌందర్య నిపుణులు.
రోజ్‌వాటర్‌తో... కప్పు గులాబీ రేకులను వేడినీళ్లల్లో వేసి అయిదు నిమిషాలు నాననిచ్చి చల్లార్చాలి. దీనిని వడకట్టి పావుకప్పు తీసుకోవాలి. ఇందులో అయిదు నుంచి ఎనిమిది చుక్కల పుదీనా నూనె కలిపి స్ప్రే సీసాలో వేసి బాగా గిలకొట్టిన తర్వాతే భద్రపరచాలి. వెలుతురు తగలని చోట ఉంచి, నెలలోపే వినియోగించుకుంటే మంచిది.

కలబందతో... మూడు చెంచాల మెత్తని కలబంద గుజ్జుకు నాలుగు చుక్కల యూకలిప్టస్‌ లేదా లావెండర్‌ నూనె కలిపి చిన్న స్ప్రే సీసాలో వేసుకోవాలి. ఈ మిశ్రమం బాగా కలిసేలా సీసాను షేక్‌ చేసి ఫ్రిజ్‌లో ఉంచాలి. మూడు నెలల్లోపు దీన్ని వినియోగించుకోవచ్చు. వాడే ప్రతీ సారీ షేక్‌ చేస్తే చాలు. రోజులో రెండు లేదా మూడుసార్లు స్ప్రే చేసుకోవాలంటే మాత్రం కలబంద రసాన్ని పావుకప్పు తీసుకుని అందులో మూడు చెంచాల రోజ్‌వాటర్‌, యూకలిప్టస్‌ నూనె కలిపి సీసాలో వేసి బాగా కలిపి ఫ్రిజ్‌లో భద్రపరచాలి. ఇలా తయారు చేసుకున్న స్ప్రేను రెండు వారాల్లోపే వాడాలి.
గ్రీన్‌ టీ ప్యాక్‌తో... రెండు గ్రీన్‌ టీ ప్యాక్‌లను అరకప్పు ఐస్‌వాటర్‌లో మునిగేలా రెండు గంటలసేపు ఉంచాలి. ఆ తర్వాత ఈ టీని స్ప్రే సీసాలో పోసి బాగా షేక్‌ చేసి ఫ్రిజ్‌లో భద్రపరచాలి. రెండు వారాల్లోపు దీన్ని ఉపయోగించుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్