Weight Loss: బరువు తగ్గించే బంగాళాదుంప!

బరువు తగ్గాలంటే శరీరంలోని అదనపు కొవ్వు నిల్వలను కరిగించాల్సిందే. ఆహారంలో కొన్ని మార్పుల ద్వారా కూడా బరువును నియంత్రించుకోవచ్చు.

Updated : 14 May 2021 12:22 IST

బరువు తగ్గాలంటే శరీరంలోని అదనపు కొవ్వు నిల్వలను కరిగించాల్సిందే. ఆహారంలో కొన్ని మార్పుల ద్వారా కూడా బరువును నియంత్రించుకోవచ్చు. దానికి కొన్ని కూరగాయలు బాగా ఉపకరిస్తాయి. అవేంటో చూడండి...

బంగాళా దుంప: దీన్ని తింటే లావవుతామనుకుంటారు చాలా మంది. ఇది నిజం కాదు. ఆలుగడ్డల్లో పొటాషియం మెండుగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. అయితే దీన్ని నూనెలో వేయించి తినొద్దు. ఉడకబెట్టి తీసుకోవడం మంచిది.

కాలీఫ్లవర్‌: ఇందులో చాలా తక్కువ కెలొరీలు ఉంటాయి. అన్నం, రొట్టె లాంటి ఎక్కువ కెలొరీలనిచ్చే ఆహార పదార్థాలకు దీన్ని ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. కప్పు కాలీఫ్లవర్‌ నుంచి 25 కెలొరీలు అందుతాయి.

బెల్‌ పెప్పర్‌: రంగురంగుల్లో లభించే ఈ కూరగాయ కూడా బరువును అదుపు చేయడంలో ముందుంటుంది. దీని నుంచి అందే కెలొరీలు చాలా చాలా తక్కువ. అలాగే దీనిలో కొవ్వును కరిగించే సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిలోని విటమిన్‌-సి పొట్టలో పేరుకుపోయిన కొవ్వు నిల్వలను తగ్గిస్తుంది.

బీన్స్‌:  కప్పు బీన్స్‌ నుంచి 31 కెలొరీలు లభ్యమైతే, కొవ్వు మాత్రం అస్సలుండదు. వీటిలో విటమిన్‌-సి, కె, ఎలతోపాటు కెరొటినాయిడ్స్‌, యాంటీఆక్సిడెంట్లు, పీచు పుష్కలంగా ఉంటాయి.

ఆకుకూరలు: ఇవి పోషకాల ఖజానాలు. వీటి నుంచి లభ్యమయ్యే కెలొరీలూ తక్కువే. వీటిలోని పీచు వల్ల ఈ కూరలు కొద్దిగా తీసుకున్నా కడుపు నిండిన భావన కలుగుతుంది.

క్యారెట్‌: ఈ పోషకాల దుంపలో పీచు ఎక్కువగా ఉండటంతోపాటు బీటా కెరొటిన్‌ మెండుగా ఉంటుంది. కొవ్వును ఖర్చుచేసే స్రావాలకు సాయం చేస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్