Covid Help: దిల్లీ నుంచి దేశమంతా...

కరోనాతో సమయానికి మందులు అందక అగచాట్లు పడేవారు, ఆక్సిజన్‌ దొరక్క అల్లాడేవారు, పడకలే కరవై విలవిల్లాడేవారు.. ఎన్ని అగచాట్లో..

Updated : 14 May 2021 06:52 IST

కరోనాతో సమయానికి మందులు అందక అగచాట్లు పడేవారు, ఆక్సిజన్‌ దొరక్క అల్లాడేవారు, పడకలే కరవై విలవిల్లాడేవారు.. ఎన్ని అగచాట్లో.. ఈ నేపథ్యంలో కొందరు యువతులు సేవ చేసేందుకు నడుం బిగించారు. సాంకేతికత ఆధారంగా వారు చేస్తున్న సేవ ఏంటో చూడండి...
సుపత్రిలో పడకలు, ప్లాస్మా, ఆక్సిజన్‌, అంబులెన్స్‌ కావాల’ంటూ వస్తున్న విజ్ఞాపనలు ఆన్యని కలచివేశాయి. బాధితులకు, ప్రాణాలను కాపాడగల వారికి మధ్య అనుసంధానం కూర్చాలనుకుంది.
ఆన్య విగ్‌ దిల్లీ లేడీ శ్రీరామ్‌ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. తక్షణసాయం కావాలంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టింగులు చూసిన ఆమె గత ఏడాది ఏప్రిల్‌లో ‘కొవిడ్‌ ఫైటర్స్‌ ఇండియా’ పేరుతో వాట్సప్‌ గ్రూప్‌ రూపొందించింది. అనేక వనరులు, సాధన మార్గాల గురించి సామాజిక మాధ్యమాల్లో సందేశాలు వస్తుంటాయి. అవి నిజమైనవో, కావో హెల్ప్‌లైన్‌ నంబర్‌ లభ్యమవుతుందో లేదో తెలీదు. సాయం కావాల్సిన అందరికీ వనరులు సమకూరే మార్గాలను చూపాలనుకుందామె. అందుకోసం గూగుల్‌ స్ప్రెడ్‌షీట్‌ను వాడుతున్నారు. అందుబాటులో ఉన్న వనరులు, కొవిడ్‌ బాధపడుతున్నవారి వివరాలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ (జ్చ్చీ-్వ్చ‌్రi్ణ్ణ), ట్విట్టర్‌లు వేదికలుగా తెలియజేస్తుంటారు. దాంతో తక్షణం సమస్యలు పరిష్కృతమవుతున్నాయి. ఈ గ్రూపులో దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థి అవనీసూద్‌ ముఖ్య సభ్యురాలు. వచ్చిన సమాచారం ఆధారంగా ఎవరి పరిస్థితి ఎలా ఉందో, అవసరాలేంటో కనుక్కుని అవి అందేట్లు చేస్తుంది. రోగులను చేర్చాక అవసరాలు తీరుతున్నాయో లేదో విచారిస్తుంది. ఈ సమాచారాన్నంతా ఎప్పటికప్పుడు ట్వీట్‌ చేస్తుంది. ముగ్గురితో ఆరంభమైన బృందంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4000 మంది సభ్యులు అంకితభావంతో పనిచేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్