మరకలు పోతాయిలా!

దొండకాయలు, వంకాయలు లాంటి కూరగాయలను కోసిన తర్వాత చేతులు నల్లగా మారతాయి. ఇలాంటప్పుడు..

Published : 16 May 2021 00:41 IST

దొండకాయలు, వంకాయలు లాంటి కూరగాయలను కోసిన తర్వాత చేతులు నల్లగా మారతాయి. ఇలాంటప్పుడు ఆ మరకలను తొలగించాలంటే ఏం చేయాలో చూద్దాం..

నిమ్మరసంతో..

ఎలాంటి మరకలనైనా పోగొట్టడంలో నిమ్మ ముందుంటుంది. ముఖ్యంగా వంకాయలు, దొండకాయలు కోసినప్పుడు చేతివేళ్లు నల్లగా మారతాయి.  అలాంటప్పుడు ఓ పాత్రలో నీళ్లు తీసుకుని వేడి చేయాలి. ఈ నీటిలో రెండు చెంచాల నిమ్మరసం వేసి కలపాలి. నీళ్లు కాస్త చల్లారిన తర్వాత చేతివేళ్లు నీటిలో మునిగేలా పెట్టాలి. ఇలా దాదాపు అయిదు నిమిషాలపాటు పెడితే మరకలు, మచ్చలు అన్నీ తొలగిపోతాయి. ఇప్పుడు చేతులను లిక్విడ్‌ సోప్‌తో  కడుక్కుని మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి.

బంగాళాదుంపతో...

కూరగాయలు కోసినప్పుడు చేతివేళ్లపై ఏర్పడే నల్ల మరకలను ఆలుగడ్డ రసం క్షణాల్లో దూరం చేస్తుంది. మీరు చేయాల్సిందల్లా బంగాళాదుంపను సగానికి కోసి ఆ ముక్కతో నల్లగా ఉన్నచోట్ల రుద్దితే సరిపోతుంది.

ఉప్పునీళ్లు...

వేడినీటిలో కాస్తంత ఉప్పు వేసి కలపాలి. అరటికాయ, బొప్పాయి, పనస పొట్టు కూరగాయలను కోయడం వల్ల ఏర్పడిన మరకలను ఈ నీళ్లు పోగొడతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్