ఉద్యోగం కాదు బాధ్యత!

సంజీవ సుస్మిత ఎంసీఏ చదివి బహుళజాతి సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసేది. రెండేళ్ల క్రితం పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం ...

Published : 16 May 2021 00:41 IST

మేమున్నాం

సంజీవ సుస్మిత ఎంసీఏ చదివి బహుళజాతి సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసేది. రెండేళ్ల క్రితం పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం వచ్చింది. గ్రామీణులకు సేవ చేసే అవకాశం కలుగుతోందని సంతోషించింది. వెంటనే చేరిపోయింది. అప్పట్నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లెందు మండలం, విజయలక్ష్మీనగర్‌ పంచాయతీ కార్యదర్శిగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించింది. కొవిడ్‌ మొదలవ్వగానే భయపడకుండా రంగంలోకి దిగింది. వ్యాధి విస్తరించకుండా ప్రజల్లో అవగాహన కలిగిస్తూ, పారిశుద్ధ్య పనులనూ ముమ్మరం చేయించింది. ఊళ్లో తిరుగుతూ బాధితులతో తరచూ మాట్లాడుతూ మనోధైర్యం కల్పిస్తోంది. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో 47 మంది దీని బారిన పడ్డారు. వారికి వైద్య సిబ్బంది సాయంతో అవగాహన కల్పించింది. సమయానికి మందులు వేసుకుంటూ, పౌష్టికాహారం తీసుకునేలా జాగ్రత్తలు తీసుకుంది. లాక్‌డౌన్‌లో ఇతర ప్రాంతాల వారు వచ్చి ఇబ్బంది కలిగించకుండా నిక్కచ్చిగా వ్యవహరించింది. ఆ సమయంలో ఒత్తిళ్లకూ వెరవలేదు. ఇప్పుడూ కొవిడ్‌ ప్రభావిత నివాసాలపై దృష్టి పెడుతూ చరవాణి ద్వారా వారికి మనోధైర్యం కల్పిస్తోంది. లక్షణాలను గుర్తించగానే వైద్య సిబ్బంది సాయంతో అండగా ఉంటోంది. కొవిడ్‌ బారిన పడిన వృద్ధులపైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టి వారికి, వారి కుటుంబ సభ్యులతో నిత్యం మాట్లాడుతూ అవగాహన కల్పిస్తోంది. ప్రమాదకర పరిస్థితులున్నా ఇది ఉద్యోగం కాదు నా బాధ్యతగా భావిస్తున్నా అంటోంది.

- కసువోజుల రాజు, ఈటీవి రిపోర్టర్‌, ఇల్లెందు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్