అలసట లేకుండా...

కాఫీ అంటే... అమ్మో అందులోని కెఫిన్‌ ఆరోగ్యానికి మంచిది కాదట అంటాం. కానీ వ్యాయామ నిపుణులు మాత్రం కసరత్తులు చేసేటప్పుడు దీన్ని తాగమని సూచిస్తున్నారు.

Published : 18 May 2021 00:09 IST

కాఫీ అంటే... అమ్మో అందులోని కెఫిన్‌ ఆరోగ్యానికి మంచిది కాదట అంటాం. కానీ వ్యాయామ నిపుణులు మాత్రం కసరత్తులు చేసేటప్పుడు దీన్ని తాగమని సూచిస్తున్నారు. ఎందుకిలా అంటారా? కండరాలు గైకోజన్‌(నిల్వ ఉన్న గ్లూకోజ్‌)ని శక్తికోసం వినియోగిస్తాయి. వాటి నిల్వలు అయిపోతే...కండరాలు బలహీనతమవుతాయి. అయితే కెఫిన్‌ కొవ్వుని వేగంగా కరిగించడానికి సాయపడుతుంది. కండరాలు అలసిపోకుండా గ్లైకోజన్‌ స్టోర్‌ని కాపాడుతుంది. దీన్ని తీసుకున్నాక గంట తర్వాత నుంచి ఇది ప్రభావం చూపించడం మొదలుపెట్టి మూడు నుంచి ఆరుగంటల పాటు సాగుతుందని చెబుతున్నారు. అందుకే తక్కువ అలసటతో ఎక్కువ ప్రయోజనం పొందేందుకు కాఫీ తాగమని సూచిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్