Immunity: ఐరన్‌ ఉమన్‌లవ్వండి!

ప్రస్తుత పరిస్థితుల్లో మన రోగనిరోధకతే మనల్ని కాపాడుతుంది. ఇది కావాలంటే మన రక్తంలో ఐరన్‌ నిల్వలు తగినంత ఉండాల్సిందే.

Updated : 18 May 2021 10:39 IST

ప్రస్తుత పరిస్థితుల్లో మన రోగనిరోధకతే మనల్ని కాపాడుతుంది. ఇది కావాలంటే మన రక్తంలో ఐరన్‌ నిల్వలు తగినంత ఉండాల్సిందే. రక్తహీనత వల్ల బోలెడు సమస్యలు వస్తాయి. కాబట్టి ఆహారంలో ఇనుము తప్పక ఉండాలి.

దానిమ్మ: ఈ పండులో ఇనుము, మెగ్నిషియం, క్యాల్షియం మూలకాలతోపాటు విటమిన్‌-సి, యాంటీ ఆక్సిడెంట్‌ సమ్మేళనాలు మెండు. రోజూ ఈ పండు లేదా పండ్ల రసం తీసుకోండి. లేకపోతే దానిమ్మ గింజల పొడి మార్కెట్లో దొరుకుతుంది. రోజుకు రెండు చెంచాల పొడిని గోరువెచ్చని నీటిలో వేసుకుని తాగితే హిమోగ్లోబిన్‌ పెరుగుతుంది.

పాలకూర: ఇనుము సమృద్ధిగా లభించే ఆకుకూరల్లో ఇది ముఖ్యమైంది. దీంట్లో యాంటీఆక్సిడెంట్లూ పుష్కలం. కాబట్టి కూర, పప్పు, సూప్‌... ఇలా నచ్చిన పద్ధతిలో తీసుకోండి.

యాపిల్‌: రోజూ తింటే హిమోగ్లోబిన్‌ శాతం పెరుగుతుంది. కాబట్టి రక్తహీనతతో బాధపడే వారికి చక్కటి ఎంపిక ఇది.

జామ: దీంట్లో విటమిన్‌-సితోపాటు ఐరన్‌ అధికంగానే ఉంటుంది. రక్తవృద్ధిని పెంచుతుంది.

అరటిపండు: దీంట్లో ఇనుము నిల్వలు ఎక్కువే. కాబట్టి తరచూ తీసుకోవాలి.

బీట్‌రూట్‌: శరీరంలో హిమోగ్లోబిన్‌ను పెంచుతుంది. దీని ఆకుల్లో దుంపలో కంటే మూడు రెట్లు ఎక్కువ ఐరన్‌ ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్