పసిపిల్లలకు ఎక్కిళ్లు వస్తే..?

పిల్లలు ఎక్కువగా నవ్వితే ఎక్కిళ్లు వస్తాయి. అలాంటప్పుడు కంగారు పడకుండా వాళ్ల నోట్లో తేనెపీక పెట్టండి. దీనివల్ల డయాఫ్రం రిలాక్స్‌ అయ్యి ఎక్కిళ్లు ఆగిపోతాయి.

Published : 20 May 2021 00:49 IST


చిన్నపిల్లలకు ఎక్కిళ్లు వచ్చినప్పుడు ఇలా చేసి చూడండి...

పిల్లలు ఎక్కువగా నవ్వితే ఎక్కిళ్లు వస్తాయి. అలాంటప్పుడు కంగారు పడకుండా వాళ్ల నోట్లో తేనెపీక పెట్టండి. దీనివల్ల డయాఫ్రం రిలాక్స్‌ అయ్యి ఎక్కిళ్లు ఆగిపోతాయి.
* ఒక్కోసారి పిల్లలు పాలుతాగే బాటిల్‌ను అదే పనిగా నోట్లో ఉంచుకున్నప్పుడు అందులో ఉండే గాలి ఎక్కువగా నోట్లోకి వెళ్తుంటుంది. దీంతో ఎక్కిళ్లు వచ్చే అవకాశం ఉంది. అందుకే నాణ్యమైన బాటిల్‌ను వాడాలి. తల్లిపాలను ఇస్తే మరీ మంచిది.
* చాలామంది తల్లులు పిల్లలకేదైనా కడుపులో ఇబ్బందిగా అనిపిస్తే గ్రైప్‌ వాటర్‌ పడతారు. అదే చిట్కా దీనికి కూడా పనిచేస్తుంది. ఎక్కిళ్లు ఎక్కువగా వస్తుంటే గ్రైప్‌ వాటర్‌ పట్టండి, తగ్గిపోతాయి. ఒకవేళ ఈ చిట్కాలన్నీ పాటించినా సరే ఎక్కిళ్లు తగ్గకపోతే వైద్యుణ్ని సంప్రదించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్