ప్రాణవాయువును పంచుతోంది

కరోనా సెకండ్‌ వేవ్‌లో ఎంతోమంది రోజూ ఆక్సిజన్‌, పడకల కోసం ఆసుపత్రుల ఎదుట ఎదురుచూపులు చూస్తున్నారు. 26 ఏళ్ల ఆర్షికీ ఇదే పరిస్థితి ఎదురైంది. తన తండ్రికి ఆక్సిజన్‌ సిలిండర్‌ కోసం ఎంతో ఇబ్బంది పడింది, చివరకు సాధించింది. ఇప్పుడు ఆ అనుభవాన్నే ఇతరుల సాయానికి ఉపయోగిస్తోంది.

Published : 20 May 2021 00:53 IST

కరోనా సెకండ్‌ వేవ్‌లో ఎంతోమంది రోజూ ఆక్సిజన్‌, పడకల కోసం ఆసుపత్రుల ఎదుట ఎదురుచూపులు చూస్తున్నారు. 26 ఏళ్ల ఆర్షికీ ఇదే పరిస్థితి ఎదురైంది. తన తండ్రికి ఆక్సిజన్‌ సిలిండర్‌ కోసం ఎంతో ఇబ్బంది పడింది, చివరకు సాధించింది. ఇప్పుడు ఆ అనుభవాన్నే ఇతరుల సాయానికి ఉపయోగిస్తోంది.
ఆర్షిది ఉత్తర్‌ప్రదేశ్‌ షాహ్‌జాన్‌పూర్‌లోని మాదార్‌ఖేల్‌ ప్రాంతం. రంజాన్‌ నెల ప్రారంభించే ఉత్సాహంలో ఉంటే తండ్రి మషూర్‌కి ఆరోగ్యం పాడైంది. పరీక్షల్లో కొవిడ్‌గా తేలింది. హోమ్‌ ఐసోలేషన్‌లోనే ఉన్నా ఆక్సిజన్‌ స్థాయులు పడిపోవడంతో సిలిండర్‌ కోసం ప్రయత్నించమని డాక్టర్‌ సూచించారు. అధికారులను సంప్రదిస్తే హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నవారికి సిలిండర్లు ఇవ్వడం కుదరని చెప్పేశారు. ఆసుపత్రిలో చేర్చే స్థోమత లేదు.

ఎన్నో ప్రయత్నాల తర్వాత సిటీ మేజిస్ట్రేట్‌ ఆఫీసు నుంచి ఒక సిలిండర్‌ సంపాదించింది. తర్వాత ఉత్తరాఖండ్‌లోని ఒక సేవాసంస్థతో సంప్రదింపులు జరిపింది. వారి దగ్గర్నుంచి ఇంకోటి సంపాదించింది. మొత్తంగా తన తండ్రి కోలుకున్నాడు. ఈ సంఘటన తర్వాత ఆక్సిజన్‌ కోసం కొవిడ్‌ పేషెంట్లు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో తనకు అర్థమైంది. తెలిసిన సమాచారంతో సాయం అందించాలనుకుంది. తన దగ్గరున్న సిలిండర్లను నింపుతూ అవసరమైన వారికి అందించడం ప్రారంభించింది. ఇందుకు సొంత డబ్బునే ఉపయోగిస్తోంది. గతంలో కోలుకున్న వారి నుంచి సిలిండర్లు సేకరించడం మొదలుపెట్టింది. వాటిని ఉద్దమ్‌ సింగ్‌ నగర్‌, హర్దోయ్‌, షాజహాన్‌బాద్‌ల్లో నింపిస్తుంది. వాటిని వాట్సాప్‌ వేదికగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆక్సిజన్‌ అవసరమైనవారికి స్కూటీ మీద వెళ్లి అందిస్తూ ప్రశంసలు అందుకుంటోంది. ఈమెను ఆ ప్రాంతాలవాళ్లు ప్రేమగా ‘సిలిండర్‌ వాలీ బిటియా’, ‘ఆక్సిజన్‌ వాలీ బిటియా’ అని పిలుస్తున్నారు!



ఎండకు తలనొప్పిగా అనిపిస్తోంటే ఆముదంలో కాస్త కొబ్బరినూనె, కొన్ని మెంతుల వేసి మరిగించండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు మాడుకు రాసి మర్దనా చేస్తే ఉపశమనం లభిస్తుంది. వేడి తగ్గుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్