ఎముకలు భద్రమిలా..

మెనోపాజ్‌ దశకు చేరుకున్న మహిళలు ఎక్కువగా ఆస్టియోపొరోసిస్‌ బారిన పడుతున్నారు. దీన్ని అధిగమించాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం..

Published : 20 May 2021 01:01 IST

మెనోపాజ్‌ దశకు చేరుకున్న మహిళలు ఎక్కువగా ఆస్టియోపొరోసిస్‌ బారిన పడుతున్నారు. దీన్ని అధిగమించాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం..
ఆస్టియోపొరోసిస్‌ అంటే ఎముకల్లో పటుత్వం తగ్గి గుల్లబారిపోవడం. మెనోపాజ్‌ దశలో ఉన్న మహిళల్లోనే ఈ సమస్య అధికం. ఈ వయసులో ఎముకలు విరిగితే అతుక్కోవడం చాలా కష్టం. కాబట్టి చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుని ఈ సమస్యకు చెక్‌ పెట్టొచ్చు.
* బరువును అదుపులో ఉంచుకోవాలి. దీనివల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. ఇందుకోసం రోజూ వ్యాయామం చేయాలి. కొద్దిపాటి బరువులు కూడా ఎత్తుతుండాలి. దీంతో కండరాలు దృఢమవుతాయి. ఎముకలూ బలంగా మారతాయి.
* అనారోగ్యకరమైన జీవన శైలి, పోషకాహార లేమి వంటివి కూడా ఆస్టియోపొరోసిస్‌కి కారణమే! అందుకే రోజువారీ ఆహారంలో బాదం, వాల్‌నట్స్‌, పాల పదార్థాలు, గుడ్లువంటివి ఉండేలా చూసుకోవాలి. క్యాల్షియం లోపం ఉన్నా ఎముకల్లో సాంద్రత తగ్గుతుంది. కాబట్టి క్యాల్షియం అందే ఆహారాన్ని తీసుకుంటుండాలి.  
* కొన్నిసార్లు ఇతర జబ్బులకి సంబంధించిన మందులు అధికంగా వాడినా ఎముకలు గుల్లబారతాయి. కాబట్టి ఏడాదికి ఒకసారి పరీక్షలు చేయించుకుంటూ ఆ మందుల్ని తగ్గిస్తే మంచిది.
* విటమిన్‌ డి లోపం ఉన్నా ఈ రకమైన సమస్య ఎదురు కావొచ్చు. రోజూ ఎండలో కాసేపు కూర్చుంటే మేలు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్