పురుగూ పుట్రా ఇలా దూరం చేద్దాం!

ఎండాకాలం వేడికి ఎక్కడో మూలనున్న పురుగూ, పుట్రా బయటకు వస్తుంటాయి. వాటిని చంపడానికి మనం రసాయనాలతో కూడిన స్ప్రేలూ, జెల్స్‌, ట్రాప్‌లు వాడుతుంటాం. అలాకాకుండా ఈ సారి సహజపదార్థాలతో ఇలా ప్రయత్నించి చూడండి.  

Published : 20 May 2021 01:04 IST

ఎండాకాలం వేడికి ఎక్కడో మూలనున్న పురుగూ, పుట్రా బయటకు వస్తుంటాయి. వాటిని చంపడానికి మనం రసాయనాలతో కూడిన స్ప్రేలూ, జెల్స్‌, ట్రాప్‌లు వాడుతుంటాం. అలాకాకుండా ఈ సారి సహజపదార్థాలతో ఇలా ప్రయత్నించి చూడండి.  
పావుకప్పు చొప్పున మౌత్‌వాష్‌, నీళ్లు, బేకింగ్‌సోడా స్ప్రే బాటిల్‌లో వేసి బాగా కలపండి. దీన్ని బొద్దింకలు ఉన్న చోట చల్లి రాత్రంతా వదిలేయాలి. పుదీనాని ఎండబెట్టి పొడి చేసి దానికి కాస్త వంటసోడా నీళ్లు కలిపి మూలల్లో పెడితే వాటి సమస్య దూరమవుతుంది.
*  కాఫీపొడిని పల్చని వస్త్రంతో చిన్నచిన్న మూటలు కింద కట్టి, వాటిని బొద్దింకలు తిరిగే చోట ఉంచితే ఆ ప్రదేశానికి రావు. అలానే బిర్యానీ ఆకుని పొడి చేసి దానికి కాస్త వెనిగర్‌, వంటసోడా కలిపి మొక్కల దగ్గర పెడితే... చీడపీడల సమస్య ఉండదు.
*  లవంగాల పొడిలో చెంచా బొరాక్స్‌ పౌడర్‌ కలిపి చీమలు వచ్చే చోట చల్లితే సరి. మూడొంతుల బొరాక్స్‌ పొడికి, ఒక వంతు పంచదారని కలిపి పురుగుపుట్రా ఉండే చోట చల్లితే ఇబ్బంది ఎదురుకాదు.
*  వేపనూనె, ఫ్యాబ్రిక్‌ సాఫ్ట్‌నర్‌లను సమపాళ్లలో తీసుకుని స్ప్రే బాటిల్‌లో వేసి కలపండి. దీన్ని పురుగులు వచ్చే చోట చల్లితే ఫలితం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్