కూరగాయల్ని శుభ్రం చేద్దామిలా..

ఈ కరోనా వల్ల బయట ఏం కొన్నా, ఏం తిన్నా భయమే కదా! అందుకే చాలామంది పండ్లను, కూరగాయల్ని శుభ్రం చేసే విషయంలో అతి జాగ్రత్త చూపుతున్నారు. వాటివల్ల లేనిపోని సమస్యలూ తెచ్చుకుంటున్నారు. అలా కాకుండా ఉండాలంటే...

Published : 20 May 2021 01:08 IST

ఈ కరోనా వల్ల బయట ఏం కొన్నా, ఏం తిన్నా భయమే కదా! అందుకే చాలామంది పండ్లను, కూరగాయల్ని శుభ్రం చేసే విషయంలో అతి జాగ్రత్త చూపుతున్నారు. వాటివల్ల లేనిపోని సమస్యలూ తెచ్చుకుంటున్నారు. అలా కాకుండా ఉండాలంటే...
కొంతమందికి ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయడం అలవాటయ్యి పండ్లు, కూరగాయల్ని కూడా అదేవిధంగా శుభ్రం చేస్తున్నారు. మరికొందరైతే సబ్బునీళ్లతో కడుగుతున్నారు. ఈ రెండూ సరికావు. ఇలా చేస్తే వాటిల్లో ఉండే ఆల్కహాల్‌ వల్ల కూరగాయల్లో ఉండే పోషకాలు నశిస్తాయి. అలా కడిగిన పండ్లను తినడం వల్ల గ్యాస్ట్రిక్‌, జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే సహజసిద్ధంగా తయారుచేసే ద్రావణాలతో కడగాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.

అవేంటంటే..
* ఒక బకెట్‌ నీళ్లలో కళ్లుప్పు, పసుపు వేసి కలపండి. ఈ నీళ్లలో తెచ్చిన పండ్లు, కూరగాయల్ని ఓ అరగంట సేపు ఉంచండి. తర్వాత మామూలు నీళ్లతో శుభ్రం చేస్తే సరి. వీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌  గుణాలు వైరస్‌లను నశింపచేస్తాయి.
*బేకింగ్‌ పౌడర్‌, వెనిగర్‌ కలిపిన నీటిలో కాసేపు వీటిని ఉంచండి. పైనున్న క్రిములు అన్నీ నశించిపోతాయి. తర్వాత కూరగాయల్ని మంచి నీటితో శుభ్రం చేస్తే సరిపోతుంది. దాంతో అటు కరోనా భయమూ ఉండదు. ఇటు అనారోగ్య సమస్యలూ దరిచేరవు.
* అన్నట్టు క్యారట్‌, బీట్‌రూట్‌, దుంపజాతి రకాల్ని మాత్రం కూరగాయలతో కలిపి కడగొద్దు. ముందుగా వీటిని మెత్తటి స్క్రబ్‌తో రుద్దండి. తర్వాత చల్లని నీటిలో కడిగి ఆరబెట్టండి. వండేటప్పుడు చెక్కు తీసేస్తే సరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్