సమయం విలువ తెలపండిలా

ఈ కరోనా వల్ల పిల్లలకి పాఠశాలలు లేవు. ఆన్‌లైన్‌ క్లాస్‌లు ఉన్నా ఆ గంట మాత్రమే.  వాళ్ల వీడియో గేమ్స్‌లో వాళ్లు బిజీ. తినే టైమ్‌ మారిపోతుంది. పడుకునే సమయం దాటిపోతుంది. ఇలాగే ఉంటే రేపు బడులు తెరిచాక చాలా ఇబ్బంది పడతారు. ఆహార మార్పుల వల్లా అనారోగ్యం బారిన పడతారు.

Published : 22 May 2021 01:38 IST

ఈ కరోనా వల్ల పిల్లలకి పాఠశాలలు లేవు. ఆన్‌లైన్‌ క్లాస్‌లు ఉన్నా ఆ గంట మాత్రమే.  వాళ్ల వీడియో గేమ్స్‌లో వాళ్లు బిజీ. తినే టైమ్‌ మారిపోతుంది. పడుకునే సమయం దాటిపోతుంది. ఇలాగే ఉంటే రేపు బడులు తెరిచాక చాలా ఇబ్బంది పడతారు. ఆహార మార్పుల వల్లా అనారోగ్యం బారిన పడతారు. అందుకే వాళ్లకి సమయం విలువ తెలపాల్సిన బాధ్యత తల్లితండ్రులదే!

బారెడు పొద్దెక్కేవరకూ పడుకోనివ్వకండి. రోజూ ఫలానా టైమ్‌కి లేవాలి. అప్పుడే ఆరోగ్యపరంగా బాగుంటారని తెలియజెప్పాలి. రెండు రోజులు మారాం చేసినా...ఆ తర్వాత నుంచి అలవాటుగా మారి వాళ్లే లేస్తారు.

*వాళ్లకి టైం టేబుల్‌ రాసివ్వండి. పొద్దున్నుంచీ రాత్రివరకూ ఏమేం చేయాలో తెలియజేయాలి. పిల్లల రూంలోనే ఆ ప్రణాళిక అంటించాలి. టైం విలువ పదే పదే చెబుతూ దాన్ని చూపిస్తుంటే తప్పకుండా మార్పు వస్తుంది.
* రోజూ ఒకే సమయానికి తినడం, పడుకోవడం, అలారం పెట్టి లేపడం అన్నీ సమయానుసారంగా జరగాలి. ఇలా చేస్తే క్రమశిక్షణ అలవడుతుంది. వాళ్ల పనులు వాళ్లే టైమ్‌కి చేసుకునేలా మారతారు.
* ఏ పనినీ వాయిదా వేసే ఆలోచనే వాళ్లకి రానీయకుండా చూడాలి. ఈరోజు పనిని ఈరోజే చేయాలి. అది పదే పదే చెబితే.. వాళ్లు అనుకున్న పనిని అనుకున్న టైంకి చేసేస్తారు. దీనివల్ల భవిష్యత్తులో లక్ష్యాన్ని సులువుగా చేరుకోగలరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్