ప్రాథమికంగా సిద్ధమేనా?

గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసుకుని ఇంటికి పరిమితమైనవారెందరో. కొవిడ్‌ సమస్య తొలగిపోయి.. ఉద్యోగ జీవితంలోకి ప్రవేశించడానికి ఎదురు చూస్తున్నారు. ఆశించడం సరే! అందుకు తగ్గట్టుగా సన్నద్ధత

Published : 23 May 2021 01:02 IST

గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసుకుని ఇంటికి పరిమితమైనవారెందరో. కొవిడ్‌ సమస్య తొలగిపోయి.. ఉద్యోగ జీవితంలోకి ప్రవేశించడానికి ఎదురు చూస్తున్నారు. ఆశించడం సరే! అందుకు తగ్గట్టుగా సన్నద్ధత మొదలుపెట్టారా మరి?
* గమనించండి: ఉద్యోగాలు వెతుక్కుంటూ వచ్చే సమయం కాదిది. అలాగని నిరాశ చెందాల్సిన పనీ లేదు. ముందుగా మీ రంగంలో సంస్థలు తమ ఉద్యోగుల నుంచి ఏం ఆశిస్తున్నాయో గమనించుకోండి. వాటిని ఓ జాబితాగా రాసుకుని మీలో ఏమేమున్నాయో చెక్‌ చేసుకోండి, లేనివాటిని నేర్చుకోండి.
* ప్రొఫైల్‌ సిద్ధం: ప్రధానంగా ఆశించే టెక్నికల్‌, సాఫ్ట్‌ స్కిల్స్‌ను చేజిక్కించుకున్నాక వాటికి అనుగుణంగా రెజ్యూమెను సిద్ధం చేసుకోండి. దాన్ని జాబ్‌ పోర్టళ్లలో ఉంచండి. దీనిలో భాగంగా ప్రొఫైల్‌నూ పూర్తిచేయాలి. ఉద్యోగ విషయంలో ఫస్ట్‌ ఇంప్రెషన్‌కు ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి, ప్రొఫైల్‌ ఆకర్షణీయంగా ఉండేలా చూసుకోండి.
* లింక్‌డిన్‌: ఉద్యోగావకాశాల సమాచారానికి మంచి వేదిక. కానీ కేవలం ఇందుకే అనుకోకండి. దీనిలో ప్రముఖ సంస్థలు, ఉన్నతోద్యోగులు ఉంటారు. నచ్చిన వాటిని/ వ్యక్తుల్ని ఫాలో అవ్వొచ్చు. తద్వారా సంస్థల తాజా ప్రాజెక్టు వివరాలు లాంటివి తెలుస్తాయి. అవసరమైతే వారి నుంచి ఉద్యోగ సంబంధిత సూచనలు, సలహాలు పొందొచ్చు.
* సాధన చేయండి: జాబ్‌ పోర్టళ్ల ద్వారా ఏదైనా ఉద్యోగావకాశం వస్తే.. ఇంటర్వ్యూను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటిలో వివిధ దశలూ ఉంటాయి. మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌తోపాటు భాషకూ ప్రాధాన్యం ఉంటుంది. వీటిని ముందునుంచీ సాధన చేయాలి. ఒక్కోసారి సంస్థలు అదనపు సమాచారాన్ని ప్రత్యేకంగా పంపమంటాయి. అభ్యర్థి రాత నైపుణ్యాలను పరిశీలించడమూ ఇందులో భాగమే. తక్కువ పదాల్లో ప్రభావవంతంగా ఎలా రాయాలో కూడా ప్రాక్టీస్‌ చేయాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్