ఇవి ధరిస్తే సరి!

నెలసరిలో వచ్చే నొప్పి భరించలేక చాలామంది మాత్రలు వాడుతుంటారు. వాటి వాడకం మంచిది కాదని తెలిసినా ప్రత్యామ్నాయం లేక ఇలా చేస్తుంటారు.

Updated : 23 May 2021 01:05 IST

నెలసరిలో వచ్చే నొప్పి భరించలేక చాలామంది మాత్రలు వాడుతుంటారు. వాటి వాడకం మంచిది కాదని తెలిసినా ప్రత్యామ్నాయం లేక ఇలా చేస్తుంటారు. కానీ లివియా సంస్థ ఈ సమస్యకు ఓ చక్కని పరిష్కారాన్ని సూచిస్తోంది. చూడ్డానికి చిన్న ఐపాడ్‌లా ఉండే ఈ పరికరంలో పూల ఆకారంలో రెండు జెల్‌పాడ్స్‌ ఉంటాయి. వాటిపై ప్లాస్టిక్‌ రేపర్‌ని తొలగించి నాభికి ఇరువైపులా అతికించుకుంటే సరి. పదినిమిషాల్లో నొప్పి అదుపులోకి వస్తుందట. ఎక్కడ ఉన్నా ధరించడానికి అనువుగా ఉంటుందీ పరికరం. తర్వాత తిరిగి భద్రపరుచుకోవచ్చు. ఒకసారి ఛార్జింగ్‌ పెడితే రెండు మూడు రోజులు పనిచేస్తుందని అంటున్నారు తయారీదారులు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్