సెనగపిండితో మెరిసే చర్మం!

చాలామంది ఖరీదైన సౌందర్య ఉత్పత్తులతో ముఖ పూతలను ప్రయత్నిస్తుంటాం. అయితే వంటింట్లోని సెనగపిండి ముఖాన్ని మెరిపిస్తుంది తెలుసా...

Published : 23 May 2021 01:02 IST

చాలామంది ఖరీదైన సౌందర్య ఉత్పత్తులతో ముఖ పూతలను ప్రయత్నిస్తుంటాం. అయితే వంటింట్లోని సెనగపిండి ముఖాన్ని మెరిపిస్తుంది తెలుసా...

* ఈ పిండి ముఖాన్ని శుభ్రం చేయడమే కాకుండా చర్మ పీహెచ్‌ను సమతుల్యం చేస్తుంది.
* ముఖంలోని మురికి, విషపదార్థాలను లోపలి నుంచి తొలగిస్తుంది.
* చర్మంపై ఉండే అధిక నూనెలను తీసేస్తుంది. అలాగని పొడిగా మార్చదు. తేమను అలాగే ఉంచి చర్మం మృదువుగా ఉండేలా చేస్తుంది.  
* సెనగపిండిలోని సహజ బ్లీచింగ్‌ సమ్మేళనాలు చర్మం మీదున్న మృతకణాలను తొలగిస్తాయి.
* ఇది చర్మ రంగును మెరుగుపరచడమే కాకుండా మెరిసేలా చేస్తుంది. అంతేకాదు అవాంఛిత రోమాలను తొలగిస్తుంది.
* మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇది అన్ని చర్మతత్వాలకు సరిపడుతుంది. ఇతర సహజ పదార్థాలతో కలిసి అద్భుతంగా పనిచేస్తుంది.

కీరతో కలిసి...
గిన్నెలో రెండు చెంచాల కీర రసం, పెద్ద చెంచాడు సెనగపిండి, చెంచా తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. వారానికో సారి ఇలా చేస్తే చక్కటి ఫలితాలుంటాయి.
లాభాలివి...
కీర చర్మాన్ని చల్లబరిచి సాంత్వన కలిగిస్తుంది. అలాగే కావాల్సిన తేమను అందిస్తుంది. సెనగపిండేమో చర్మ రంధ్రాలను శుభ్రం చేసి మలినాలను తొలగిస్తుంది. తేనె సహజ పద్ధతిలో తేమను అందిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్