యోగా క్లాసులు ఒత్తిడిని తగ్గిస్తాయి...

ఈ రోజుల్లో చిన్నా, పెద్దా తేడాలేకుండా అందరినీ ఒత్తిడి వెంటాడుతోంది. దీన్ని అదుపులో ఉంచుకోవడానికి యాంటీ డిప్రెసెంట్లు వాడుతుంటారు. కానీ యోగా తరగతులకు క్రమం తప్పకుండా హాజరైతే చాలు... అంతకుమించిన సానుకూల ఆరోగ్య ఫలితాలు వస్తాయి అంటోంది ఓ విదేశీ అధ్యయనం

Published : 25 May 2021 00:34 IST

ఈ రోజుల్లో చిన్నా, పెద్దా తేడాలేకుండా అందరినీ ఒత్తిడి వెంటాడుతోంది. దీన్ని అదుపులో ఉంచుకోవడానికి యాంటీ డిప్రెసెంట్లు వాడుతుంటారు. కానీ యోగా తరగతులకు క్రమం తప్పకుండా హాజరైతే చాలు... అంతకుమించిన సానుకూల ఆరోగ్య ఫలితాలు వస్తాయి అంటోంది ఓ విదేశీ అధ్యయనం. దీని ప్రకారం శ్వాసమీద దృష్టి కేంద్రీకరించి చేసే యోగసాధన వల్ల నరాల వ్యవస్థ బలపడుతుంది. శారీరకంగా సౌకర్యం ఉంటుందని చెబుతోంది. బోస్టన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కి చెందిన డాక్టర్‌ క్రిస్‌ స్ట్రీటర్‌ ఈ నివేదికను వెల్లడించారు. ఈ పరిశోధనలో యాంటీ డిప్రెసెంట్లు వాడిన నలభైశాతం మంది పూర్తిగా కుంగుబాటు నుంచి కోలుకోలేకపోయారట. వారిని యోగా ప్రయత్నించమని చెబితే చక్కటి ఫలితం కనిపించింది అని చెబుతున్నారు ఈ డాక్టర్‌.


కలబంద గుజ్జును నుదుటికి రాసి అరగంట తర్వాత స్నానం చేస్తే వేసవితాపం తగ్గుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్