మోముకు పాల మెరుపు!

పాలు పోషకాలనిస్తాయి. అంతేనా... బుగ్గలకు చక్కటి  మెరుపునూ అందిస్తాయి. ఎలానో చూద్దామా..

Published : 25 May 2021 00:43 IST

పాలు పోషకాలనిస్తాయి. అంతేనా... బుగ్గలకు చక్కటి  మెరుపునూ అందిస్తాయి. ఎలానో చూద్దామా..
పొడి, సున్నితమైన చర్మం ఉన్నవారు ముఖానికి తేనె, పాలు కలిపి రాసుకుంటే కాంతులీనే మోము మీ సొంతమవుతుంది. ఈ రెండూ చర్మంలోని మురికిని తొలగించి శుభ్రం చేస్తాయి. పొడి చర్మానికి కావాల్సిన పోషణను అందిస్తాయి. అంతేకాదు మొటిమలు, మచ్చలు, నల్లటి వలయాలు తగ్గుముఖం పడతాయి.
ఎలా వాడాలంటే.. చెంచా చొప్పున పాలు, తేనెలను ఓ చిన్నపాటి గిన్నెలో కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసుకుని చేతివేళ్లతో మృదువుగా మర్దనా చేయాలి. పావు గంట తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి.
పసుపు, పచ్చపాలతో.. ముఖంపై ఏర్పడే మరకలను తొలగించాలంటే... పసుపు, పచ్చి పాలు కావాల్సిందే. రకరకాల రసాయనాల క్రీమ్‌లు వాడే బదులు సహజసిద్ధమైన ఈ పదార్థాలు మేనుకు మేలు చేస్తాయి. పసుపులోని సమ్మేళనాలు బ్లీచింగ్‌ ఏజెంట్‌లా పనిచేస్తాయి. పాలు టోనర్‌, క్లెన్సర్‌లా ఉపయోగపడతాయి. ఈ రెండింటితో సహజంగానే చర్మం పూర్తిగా శుభ్రపడుతుంది.  
ఓ పాత్రలో పెద్ద చెంచా పచ్చిపాలు, పావుచెంచా పసుపు వేసి కలపాలి. దీన్ని ముఖానికి రాసుకుని మసాజ్‌ చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత నీటితో కడిగేయాలి. ఇది ముఖాన్ని మృదువుగా మార్చి మెరిసేలా చేస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్