ఎప్పుడూ అదేనా!

స్కూల్లో కలిసి చదివిన నా స్నేహితురాలితో కాసేపు మనసు విప్పి మాట్లాడదామంటే కుదరడం లేదు. ఆమె ప్రవర్తన మారిపోయింది. తను కొనుక్కున్న చీరలు, నగల గురించి గొప్పలు చెప్పడమే సరిపోతోంది. తను ఎందుకిలా మారిందో, మార్పు రావాలంటే ఏం చేయాలో చెప్పండి.  

Published : 25 May 2021 00:47 IST

స్కూల్లో కలిసి చదివిన నా స్నేహితురాలితో కాసేపు మనసు విప్పి మాట్లాడదామంటే కుదరడం లేదు. ఆమె ప్రవర్తన మారిపోయింది. తను కొనుక్కున్న చీరలు, నగల గురించి గొప్పలు చెప్పడమే సరిపోతోంది. తను ఎందుకిలా మారిందో, మార్పు రావాలంటే ఏం చేయాలో చెప్పండి.  

- ఓ సోదరి

మనం గమనించాల్సింది ఏమంటే స్కూల్లో ఉన్నప్పుడు చదువు, సినిమాలు, ఆటలు, పాటలు, ఒకరి గురించి ఒకరు ముచ్చట్లు ఇలా మన ప్రపంచం చాలా చిన్నది. పెద్దవుతున్న కొద్దీ పరిస్థితులు, ప్రభావాలు, జీవనసరళి మారిపోతుంటాయి. చిన్నప్పుడున్నట్టే తర్వాతా ఉండాలనుకోవడం తప్పు. ఇంకో సంగతేమంటే మన ఇష్టాలతో సరిపోయేవాళ్లు పెద్దయ్యాక్కూడా స్నేహితులుగా ఉంటారు. అనుకూలమైన వాళ్లతో ఉంటే ఇలాంటివి సమస్యలుగా అనిపించవు. ఆమెకి చీరలు, నగలు, గొప్పలు చెప్పుకోవడంలో ఆనందం కనుక అలా ఉంటుంది. మీకు వాటిమీద ఇష్టం లేనందున చిరాకుగా అనిపిస్తుండొచ్చు. అనవసరంగా ఆవిడతో మాట్లాడి ఒత్తిడి ఫీలవడం కంటే మీ మనస్తత్వానికి సరిపోయే వాళ్లతో స్నేహంగా మెలగొచ్చు. ఒకవేళ అలా దొరక్కపోతే టీవీలో మంచి కార్యక్రమాలో యూట్యూబ్‌లో వంటలో చూడండి. పిల్లలతో కాలం గడుపుతూ వాళ్లకు ఆదర్శంగా ఉండండి. మీవారితో కబుర్లు చెప్పండి. రోజంతా కలిసుండే మీ కుటుంబసభ్యులకు మీ గురించి బాగా తెలుసు, అర్థం చేసుకుంటారు కనుక వాళ్లు మీకు సంతోషాన్ని ఇవ్వగలుగుతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్