పొట్ట తగ్గాలా...
పెరిగిన పొట్ట వల్ల దుస్తులు బిగుతుగా మారడమే కాదు..రకరకాల అనారోగ్యాలు చుట్టుముడతాయి. నలుగురిలోకీ వెళ్లాంటే నామోషీగా ఫీలవుతారు. ఇన్ని ఇబ్బందులకు గురిచేస్తున్న ఈ పొట్టను సరైన వ్యాయామాలు చేస్తూ, ఆహారంలో కొన్ని మార్పుల ద్వారానూ తగ్గించుకోవచ్చు. ఎలా అంటే...
పెరిగిన పొట్ట వల్ల దుస్తులు బిగుతుగా మారడమే కాదు..రకరకాల అనారోగ్యాలు చుట్టుముడతాయి. నలుగురిలోకీ వెళ్లాంటే నామోషీగా ఫీలవుతారు. ఇన్ని ఇబ్బందులకు గురిచేస్తున్న ఈ పొట్టను సరైన వ్యాయామాలు చేస్తూ, ఆహారంలో కొన్ని మార్పుల ద్వారానూ తగ్గించుకోవచ్చు. ఎలా అంటే...
వీటికి దూరంగా!
వేపుళ్లు... వీటిలో కెలొరీలు ఎక్కువ. ఈ వంటకాల్లోని నూనె పొట్టలోకి వెళ్లి కొవ్వుగా మారుతుంది. ఇది కరిగిపోవడం చాలా కష్టమైన ప్రక్రియ. దాంతో ఊబకాయం, మధుమేహం, మరికొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వీలైనంత వరకు వేపుళ్లకు దూరంగా ఉండాలి.
చక్కెర ద్రవాలకూ... మనం తాగే సోడా, శీతల పానీయాలు, మార్కెట్లో దొరికే పండ్లరసాల్లో పెద్ద మొత్తంలో చక్కెర ఉంటుంది. అలాగే బిస్కట్లు, బేకరీ ఉత్పత్తులు, చాక్లెట్లలో కూడా. వీటి నుంచి తక్కువ కెలొరీలు లభిస్తాయి. అయితే చక్కెర ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది రక్తం, హర్మోన్లపై ప్రభావాన్ని చూపుతుంది. ఇది పొట్టకే కాదు కాలేయంలోనూ కొవ్వులు జమ కావడానికి కారణమవుతుంది. ఇది అనారోగ్యానికి సంకేతం. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి.
ఉప్పు... పొట్ట పెరగడానికి ఉప్పు ఎక్కువగా తినడం కూడా ఒక కారణమే అంటున్నారు నిపుణులు. ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల నీళ్లు ఎక్కువగా తాగాలనిపిస్తుంది. అలా అని అవసరానికంటే ఎక్కువ నీళ్లు తాగితే అది సమస్యే కదా. ఇది మీ బరువులో మార్పు తెస్తుంది.
మరి ఏం చేయాలంటే... వేపుళ్లకు బదులుగా కూరగాయలను ఉడికించి తీసుకోవాలి. లేదా అవెన్‌లో ఉడికించాలి. స్వీట్ తినాలనిపించినప్పుడు బెర్రీ, మామిడి లాంటి పండ్లను తినాలి. టీ కాఫీలకు బదులుగా కూరగాయలు, పండ్ల రసాలను తాగాలి. చిప్స్, వడియాలు, అప్పడాలు కాకుండా ఎండుఫలాలు, గింజలు, ప్రూట్ క్యాండీలను తింటే సరి.
ఇవి తినండి!
యాపిల్... రోజూ ఓ యాపిల్ తింటే మీ పొట్ట తగ్గుతుంది తెలుసా... ఈ పండులో ఆరోగ్యకరమైన పీచు ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలోని అధిక కొవ్వులను కరిగిస్తుంది.
పెరుగు... ప్రొటీన్భరిత పెరుగు పొట్టలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. దీంట్లోని అధిక ప్రొటీన్ జీవక్రియలను మెరుగు పరుస్తుంది. ఇవి అధిక కెలొరీలను కరిగించడంతో పాటు కడుపు నిండిన భావనను కలిగిస్తాయి.
చిరుధాన్యాలు... పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును తగ్గించడంలో చిరుధాన్యాలు ముఖ్య పాత్ర వహిస్తాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. ముతకబియ్యం, గోధుమలు, ఓట్స్, క్వినోవా, రాగులు, సామలు, జొన్నలు... వీటన్నింటినీ ఆహారంలో చేర్చుకోండి మరి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
- వేసవిలో వీటి విషయంలో జాగ్రత్త!
- వ్యాయామం వల్ల మొటిమలు రాకుండా..!
ఆరోగ్యమస్తు
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
- వేరుశనక్కాయలు తింటే... ధ్యానం చేసినట్లే!
- తేలిగ్గా తీసుకోవద్దు!
- ప్రసవానంతరం పొట్టను ఇలా తగ్గించుకుందాం!
అనుబంధం
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
- అనుమానిస్తున్నాడని నిరూపించేదెలా?
యూత్ కార్నర్
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
- విరాళాలకు వారధిగా.. ఆమె సేవలు!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!