ఆపద్బాంధవి..ఆటో సునీత

ఆటో నడపడంలో తొమ్మిదేళ్ల అనుభవం.. ఆమెకు ఓ అవకాశాన్ని తెచ్చిపెట్టింది. అది.. కొవిడ్‌ రోగులను ఆసుపత్రులకు చేర్చడం. దాన్ని ఆమె బాధ్యతగా తీసుకుంది. సంబంధిత మెలకువలను నేర్చుకుని మరీ.. సేవకు సిద్ధమైంది. ఆమే 42 ఏళ్ల సునీత.

Published : 28 May 2021 01:00 IST

ఆటో నడపడంలో తొమ్మిదేళ్ల అనుభవం.. ఆమెకు ఓ అవకాశాన్ని తెచ్చిపెట్టింది. అది.. కొవిడ్‌ రోగులను ఆసుపత్రులకు చేర్చడం. దాన్ని ఆమె బాధ్యతగా తీసుకుంది. సంబంధిత మెలకువలను నేర్చుకుని మరీ.. సేవకు సిద్ధమైంది. ఆమే 42 ఏళ్ల సునీత.
సునీతది కేరళలోని కొచ్చి. కేపీ వాలన్‌ రోడ్‌లోని ఆటోరిక్షా స్టాండ్‌ నుంచి ఆటోను గత తొమ్మిదేళ్లుగా నడుపుతోంది. కొచ్చి సంస్థ ఓ జర్మన్‌ సంస్థతో కలిసి ‘ఆటోరిక్షా అంబులెన్స్‌’ విధానానికి శ్రీకారం చుట్టింది. ఇందుకు 18మంది డ్రైవర్లను వాలంటీర్లుగా ఎంపిక చేసింది. వారిలో సునీత ఒక్కరే మహిళా డ్రైవర్‌. సునీతకు ఇక్కడి రోడ్లపై అవగాహన ఉండటమూ ఇందుకు కారణం. ‘ఇది తేలికైన పని కాదని తెలుసు. కానీ.. నా వంతుగా నేను చేయగలిగిన సేవ ఇదే. అందుకే వెంటనే ఒప్పేసుకున్నా’ అంటోంది సునీత.

ఇందులో భాగంగా ఆమె నిపుణులు, డాక్టర్ల నుంచి ప్రత్యేక శిక్షణనూ తీసుకుంది. కొవిడ్‌ బాధితులతో పనిచేయడం, పీపీఈ ఎక్విప్‌మెంట్‌ను ధరించడం, ఇతర రక్షణపరమైన అంశాలపై ఈ ట్రైనింగ్‌ సాగింది. వారిని ఆసుపత్రులకు తీసుకెళ్లడం, మధ్యలో అవసరమైన మందులు అందించడం, ఆక్సిజన్‌, శరీర ఉష్ణోగ్రతలను నమోదు చేయడంతోపాటు వైద్యసిబ్బందిని రోగుల ఇళ్లకు తీసుకెళ్లడం లాంటివీ చేయాల్సి ఉంటుంది. ఆమె నిర్ణయాన్ని మేయర్‌ సహా చాలామంది సోషల్‌ మీడియా వేదికగా మెచ్చుకుంటున్నారు. ‘ఎంతోమంది తమ ప్రాణాలను పణంగా పెట్టిమరీ రోగుల ప్రాణాలు కాపాడుతున్నారు. నేను ఆటోరిక్షా అంబులెన్స్‌ డ్రైవర్‌గా వారికి తోడుగా... కొవిడ్‌కి వ్యతిరేకంగా పనిచేస్తా’ అంటోంది సునీత. ఎండా, వానా లేకుండా ప్రయాణికులను ఎలా గమ్యానికి తీసుకెళ్తామో.. అలాగే ఇప్పుడు మరింత బాధ్యతతో కొవిడ్‌ బాధితులను ఆసుపత్రులకు చేరుస్తామంటోంది. మనమూ తన ప్రయత్నాన్ని అభినందిద్దాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్