డబుల్‌ చిన్‌ తగ్గిద్దామా

సాధారణంగా ఊబకాయుల్లో కొవ్వు పెరిగి డబుల్‌ చిన్‌ వస్తుంది. వయసు పెరగడం వల్ల కూడా రావొచ్చు. అవి కాక మనం చేసే కొన్ని పొరపాట్ల వల్లా ఇలా వస్తుంది. దీన్ని తగ్గించుకోవడమెలాగో చూద్దాం...

Published : 28 May 2021 01:02 IST

సాధారణంగా ఊబకాయుల్లో కొవ్వు పెరిగి డబుల్‌ చిన్‌ వస్తుంది. వయసు పెరగడం వల్ల కూడా రావొచ్చు. అవి కాక మనం చేసే కొన్ని పొరపాట్ల వల్లా ఇలా వస్తుంది. దీన్ని తగ్గించుకోవడమెలాగో చూద్దాం...
మొదట మ్యాట్‌పై నిటారుగా కూర్చోవాలి. ఇప్పుడు తలను ఎడమ వైపు తిప్పి, ఓ పదిసెకన్లు ఆగి, మళ్లీ యథాస్థానానికి రావాలి. అలాగే కుడి వైపూ చేయాలి. ఇప్పుడు తలను కిందకు వంచి వీలైనంత వరకు కుడి వైపునకు ఓసారి... ఎడమ వైపునకు మరోసారి తిప్పాలి. ఇప్పుడు మామూలు స్థితికి రావాలి. ఇలా రెండు మూడుసార్లు చేసి విరామం తీసుకోవాలి. ఇప్పుడు మెల్లగా తలను పైకెత్తుతూ మొత్తం వెనక్కి వంచాలి. ఈ స్థితిలో ఉంటూ నోరు తెరుస్తూ, మూస్తూ ఉండాలి... ఇలా పదిసార్లు చేయాలి. ఆ తర్వాత మామూలు స్థితికి వచ్చేయాలి. ఇప్పుడు తలను కుడివైపునకు కాస్త ఎత్తులో తిప్పి నోటిని తెరుస్తూ మూస్తూ పదిసార్లు చేయాలి. ఇది చూడటానికి కాస్త వింతగా కనిపించినా ఫలితం మాత్రం బాగుంటుంది. ఆ తర్వాత పూర్వపు స్థితికి రావాలి. ఇప్పుడు రెండో వైపు కూడా ఇలానే చేయాలి. ఇది చేశాక మాములు పొజిషన్‌కు వచ్చేయాలి. రోజూ ఇలా చేయడం వల్ల చుబుకంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. ఈ వ్యాయామాన్ని ప్రయత్నించి చూడండి మరి.



ఎండ కారణంగా చర్మం కమిలిపోతే అక్కడ వెనిగర్‌లో ముంచిన పేపర్‌ టవల్‌ను ఉంచండి. ఉపశమనం ఉంటుంది. దీనిలోని అసెటిక్‌ యాసిడ్‌ కమిలిన చోట కలిగే నొప్పీ, దురదనూ తగ్గిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్