ఈ చిన్నదాని ఆదాయం రూ.400కోట్లు!

గడిచిన  ఏడాది కాలంలో దాదాపు 400 కోట్ల రూపాయల ఆదాయం అందుకుని... అరుదైన ఘనతని సొంతం చేసుకుంది టెన్నిస్‌ క్రీడాకారిణి నవోమీ ఒసాకా. అవును.. ఇంతవరకూ అంత మొత్తంలో సంపాదించిన క్రీడాకారిణులు లేరట. ఇందులో మ్యాచు ఫీజుగా వచ్చేది

Published : 28 May 2021 01:16 IST

గడిచిన  ఏడాది కాలంలో దాదాపు 400 కోట్ల రూపాయల ఆదాయం అందుకుని... అరుదైన ఘనతని సొంతం చేసుకుంది టెన్నిస్‌ క్రీడాకారిణి నవోమీ ఒసాకా. అవును.. ఇంతవరకూ అంత మొత్తంలో సంపాదించిన క్రీడాకారిణులు లేరట. ఇందులో మ్యాచు ఫీజుగా వచ్చేది రూ. 38కోట్లే. తక్కినదంతా తను మోడల్‌గా వ్యవహరిస్తోన్న అంతర్జాతీయ ఫ్యాషన్‌ సంస్థల నుంచే అందుకొంటోంది. లూయిస్‌ఉయిటాన్‌, నైక్‌, లెవీస్‌ వంటి పాతికకు పైగా అంతర్జాతీయ సౌందర్య, ఆహార సంస్థలకు నవోమి బ్రాండ్‌ అంబాసిడర్‌ మరి.
ఒక్క నైక్‌ సంస్థే ఏడాదికి 72కోట్ల రూపాయలు చెల్లిస్తోంది. జపాన్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 23 ఏళ్ల నవోమికి చిన్నప్పుడు సెరెనా, వీనస్‌ విలియమ్‌ సిస్టర్స్‌ అంటే అపారమైన అభిమానం. వాళ్ల స్ఫూర్తితోనే మూడేళ్ల వయసులో టెన్నిస్‌లో అడుగుపెట్టిన నవోమి సెరెనా విలియమ్స్‌పైనే విజయం సాధించడం విశేషం. ఇప్పటి వరకూ నాలుగుసార్లు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లను గెలుచుకుంది. ఈమె సంపాదించడంలోనే కాదు... పెట్టుబడులు పెట్టడంలోనూ దిట్టే. గత సంవత్సరం నార్త్‌కరోలినా విమెన్స్‌ సాకర్‌లీగ్‌ ఓనర్‌షిప్‌ని సొంతం చేసుకుంది. కిన్లో పేరుతో సౌందర్య ఉత్పత్తులని తయారుచేస్తోంది. ప్రత్యేక స్విమ్‌వేర్‌ కలెక్షన్‌నీ అందిస్తూ వ్యాపారరంగంలోనూ దూసుకుపోతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్