అద్భుత ముద్రలు!

కొవిడ్‌ భీతిల్లచేస్తున్న తరుణంలో చాలా ప్రయోజనకరమైన, తప్పక చేయాల్సిన ముద్రలివీ...

Updated : 30 May 2021 00:10 IST

కొవిడ్‌ భీతిల్లచేస్తున్న తరుణంలో చాలా ప్రయోజనకరమైన, తప్పక చేయాల్సిన ముద్రలివీ...

శ్వాస ముద్ర

చిటికెన వేలు చివరను బొటన వేలు మొదట, ఉంగరం వేలు చివరను బొటన వేలు మధ్యలో, మధ్య వేలు చివరను బొటనవేలు అంచున పెట్టాలి. చూపుడువేలు తిన్నగా ఉంటుంది. రెండు చేతులను తొడలమీద పెట్టి, నిటారుగా వెనక్కి కూర్చుని కళ్లు మూసుకుని నెమ్మదిగా శ్వాస పూర్తిగా తీసుకుని వదులుతూ లోపలి కల్మషాలు, దుఃఖాలు బయటకు పోవాలనుకుంటూ చేయాలి. ఐదు నిమిషాలు ఈ ముద్రలో కూర్చుంటే వెంటనే ఫలితం ఉంటుంది. కింద లేదా కుర్చీలో, ఆరోగ్యం బాగోకుంటే పడుకునీ చేయొచ్చు. దీనివల్ల ఊపిరితిత్తుల్లో నిమ్ము వెళ్లిపోతుంది. ప్రాణవాయువును బాగా తీసుకోగల్గుతాం. ఇది నూరుశాతం సురక్షితం. శ్వాస ఇబ్బందులుంటే రెండు గంటలకోసారి చేస్తే తగ్గిపోతాయి. సమస్య లేనివాళ్లు రోజుకు మూడుసార్లు చేస్తే శ్వాస ఇబ్బందులు రావు. పాజిటివ్‌ వచ్చినవాళ్లు తప్పక చేయాల్సిన అద్భుత ముద్ర.

శ్వాసనాలిక ముద్ర

కళ్లు మూసుకుని రెండుమూడుసార్లు దీర్ఘంగా శ్వాస తీసుకుని వదలండి. అదయ్యాక రెండు చేతుల మధ్య వేళ్లను మడిచి దగ్గరగా చేర్చి, తక్కిన వేళ్లను దూరంగా ఉంచాలి. చేతులను ఉదరం వద్ద ఉంచాలి. మోచేతులను శరీరానికి కాస్త దూరంలో ఉంచాలి. వెన్నెముక నిటారుగా ఉంచి, కళ్లు మూసుకుని శ్వాస మీద కేంద్రీకరించండి. మామూలు వాళ్లు రోజుకు రెండుసార్లు, పాజిటివ్‌ వచ్చిన వాళ్లు నాలుగు సార్లు చేస్తే ఇన్ఫెక్షన్‌ తగ్గుతుంది.

కుంభక ప్రాణాయామం

ఈ ముద్రలు చేసిన తర్వాత కుంభక ప్రాణాయామం చేయాలి. ఇది కూడా అంతే కింద లేదా కుర్చీలో లేదా సమస్య ఉంటే పడుకుని చేయొచ్చు. నిటారుగా కూర్చోవాలి. రెండు పాదాలూ సమాంతరంగా ఆనించి ఉంచాలి. రెండు చేతులూ బొటనవేలు, చూపుడు వేలు కలిపి తొడలమీద ఉంచి ప్రశాంతంగా శ్వాస తీసుకుని నోటితో వదిలేయాలి. ఇలా ఐదుసార్లు చేసి, ఆరోసారి రెండు ముక్కులతో శ్వాస తీసుకుని, ఐదు సెకన్లు శ్వాస నిలిపి, తిరిగి ముక్కుతోనే వదలండి. ఇలా మూడుసార్లు చేయాలి. ఊపిరితిత్తులు బలపడతాయి, రోగనిరోధకశక్తి పెరుగుతుంది. గ్లైసిన్‌ వృద్ది చెందుతుంది. గ్లైసిన్‌ లేకపోతే రోగనిరోధక శక్తి తగ్గుతుంది. మెదడుకు సంకేతాలు అందవు. వాసనలు తెలీవు. నిమ్ము పేరుకుపోతుంది. రక్తం గడ్డకడుతుంది. కనుక ప్రతి ఒక్కరూ ఈ ప్రాణాయామం చేయాలి. ఊపిరితిత్తులే కాదు మన శరీరమంతా శక్తిమంతమవుతుంది. మెదడు చురుగ్గా ఉంటుంది.
వీటితో బాటు ఆహారం కూడా చాలా ముఖ్యం. ఇప్పుడున్న వైరస్‌ మన శరీరంలో ఉన్న గ్లైసిన్‌ను నాశనం చేస్తుంది. దీన్ని వృద్ధిచేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ నువ్వులనూనె, నువ్వుండ, నువ్వుకారం, నువ్వుల మొలకలు- ఇలా ఏదో రూపంలో నువ్వులు తినాలి. తెలగపిండి కూర తినాలి. పాజిటివ్‌ వచ్చినవాళ్లు రోజుకు రెండు స్పూన్లు నువ్వుల నూనె తాగండి లేదా ఆయిల్‌ పుల్లింగ్‌ చేయండి.  ఊపిరితిత్తులు ఇన్‌ఫెక్టయి ఉన్నప్పుడు కడుపు నిండా తినకూడదు. సాయంత్రం ఐదున్నర లోపే తినేయాలి. సి-విటమిన్‌ ఉండే పండ్లు రెండు, ఉడికించిన కూరలు తినాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్