గుండెని నిబ్బరంగా ఉంచుకోండి

శరీరంలో దేని ప్రాముఖ్యం దానికున్నా.. గుండె మరింత ప్రధానమైంది. అది కనుక మొరాయించిందంటే ఇక అంతే సంగతులు.

Published : 30 May 2021 00:16 IST

శరీరంలో దేని ప్రాముఖ్యం దానికున్నా.. గుండె మరింత ప్రధానమైంది. అది కనుక మొరాయించిందంటే ఇక అంతే సంగతులు. కనుక దాన్ని పదిలంగా కాపాడుకుందాం..
తర జబ్బులు నెమ్మదిగా దాడి చేస్తాయి. కానీ గుండెపోటు మాత్రం అకస్మాత్తుగా వచ్చేసి ఇంటిల్లిపాదినీ ఆందోళనలోకి నెట్టేస్తుంది. గుండెకు సంబంధించిన ప్రతి సమస్యనీ నివారించలేకున్నా అధికశాతం సంరక్షించుకోవడం మన చేతిలోనే ఉంటుంది.
* పురుషులతో పోలిస్తే స్త్రీలకు ఇంటి బాధ్యతలతో ఒత్తిడి ఎక్కువ. ఇది మితిమీరితే  గుండెమీద ప్రభావం చూపుతుంది కనుక దాన్ని తగ్గించుకోవడానికి రోజులో కొంత సమయం కేటాయించుకుని ఇష్టమైన వ్యాపకాలతో కులాసాగా గడపండి.
* ఎంత తీరిక లేకున్నా అరగంటకు తగ్గకుండా వ్యాయామం చేయండి. అది చాలా అవసరం.
* దేని గురించీ అతిగా ఆలోచించి ఆందోళన చెందకండి. అది గుండెమీద భారం మోపుతుంది. సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి, లేదా ఆత్మీయుల సలహా తీసుకోండి.
* రక్తపోటు ఉంటే క్రమం తప్పకుండా మందులు వాడుతూ అదుపులో ఉంచుకోవాలి. జీవన సరళితోనూ బీపీని చాలావరకూ తగ్గించుకోవచ్చు.
* పోషకాహారం తీసుకోండి. కొలెస్ట్రాల్‌ స్థాయి పెరగకుండా చూసుకోండి.
* రోజంతా పడిన అలసట తీర్చేది నిద్రే. మీ వయసును బట్టి ఆరు నుంచి ఏడు గంటల నిద్ర ఉండేలా చూసుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్