రోజూ ఫేస్‌ వాష్‌...?

మీరూ ఫేస్‌వాష్‌ ఉపయోగిస్తారా? అయితే మీ ముఖం సురక్షితమన్నమాట. ఎందుకంటే ఫేస్‌వాష్‌తో ఎన్నో ప్రయోజనాలున్నాయి. అవేంటో చదవండి...

Published : 30 May 2021 00:18 IST

మీరూ ఫేస్‌వాష్‌ ఉపయోగిస్తారా? అయితే మీ ముఖం సురక్షితమన్నమాట. ఎందుకంటే ఫేస్‌వాష్‌తో ఎన్నో ప్రయోజనాలున్నాయి. అవేంటో చదవండి...
గాలిలోని దుమ్మూ ధూళితో చర్మం మీద మలినాలు పేరుకుంటాయి. ఎప్పటికప్పుడు ముఖాన్ని శుభ్ర పరుచుకోకపోతే మొటిమలు, టాన్‌ సమస్యలు మొదలవుతాయి. వీటన్నింటికీ చెక్‌ పెట్టాలంటే కేవలం నీటితోనే కడగడం కాకుండా ఫేస్‌ వాష్‌ కూడా ఉపయోగించాలి అంటున్నారు నిపుణులు.
* ఫేస్‌వాష్‌తో రోజుకి రెండుసార్లు ముఖాన్ని కడిగితే మొటిమలు, మచ్చలు, డార్క్‌ సర్కిల్స్‌, డార్క్‌ స్పాట్స్‌ మొదలైన చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు. చర్మం మీద ముడతల్ని, వృద్ధాప్య ఛాయలను నివారిస్తుంది.
* ఫేస్‌వాష్‌తో ముఖాన్ని బాగా రుద్ది కడగడం వల్ల టాన్‌ పోయి చక్కగా శుభ్రమవుతుంది. రక్త ప్రసరణ మెరగవడంతో పాటూ చర్మం కాంతులీనుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్