నీళ్లే కదా అనుకుంటే..

కొందరు తగినన్ని మంచి నీళ్లు తాగరు. మరికొందరు.. ఏదో పనిలో పడి నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇంకొందరు బాగానే తాగుతున్నాంగా అనుకుంటారు. నీళ్లు తాగకపోవడం చిన్నసమస్య ఏమీకాదు. ఎన్నో

Published : 31 May 2021 00:17 IST

కొందరు తగినన్ని మంచి నీళ్లు తాగరు. మరికొందరు.. ఏదో పనిలో పడి నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇంకొందరు బాగానే తాగుతున్నాంగా అనుకుంటారు. నీళ్లు తాగకపోవడం చిన్నసమస్య ఏమీకాదు. ఎన్నో అనారోగ్యాలకు ఇదే ప్రధాన కారణం.
యాక్నె: మొటిమల కంటే పెద్ద పరిమాణంలో గడ్డలు ముఖమంతా కనిపిస్తున్నాయా? మీ శరీరంలో నీళ్లు తగ్గాయని వాటి అర్థం. మంచి నీళ్లు తగినన్ని తాగేవారిలో ఈ మొటిమలు, యాక్నె వంటి సమస్యలుండవు.
కళ్ల కింద ముడతలు: ముఖమంతా కమిలిపోయి, కాంతిని కోల్పోయి ఉంటుంది. ముఖ్యంగా కళ్ల కింద ముడతలు, వాపు ఉన్నాయంటే దానర్థం మీ ఒంట్లో నీటిశాతం తగ్గిందని. ముక్కు ఎర్రబడి, పొడిగా ఉన్నా నీటిలోపం ఉన్నట్టే. రోజంతా మత్తుగా, అలసటగా అనిపించడమూ దీని లక్షణమే.

దురదగా: మీరు మంచినీటి విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారని మీ జుట్టు తేలికగా చెప్పేస్తుంది. తలంతా చుండ్రుపట్టి, జుట్టు జీవం లేకుండా కనిపిస్తే ఎన్ని నీళ్లు తాగుతున్నారన్న దాని మీద దృష్టి పెట్టండి.
కళ్లు: ఇవి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి తగినంత పొటాషియంతోపాటు ఎలక్ట్రోలైట్ల బ్యాలెన్స్‌ కూడా ఉండాలి. ఈ రెండింటినీ అందించేవి మీరు తాగే నీళ్లే!
బరువు తగ్గి: భోజనానికి 20 నిమిషాల ముందు రెండు కప్పుల నీటిని తాగితే బరువు తగ్గాలనుకున్న వారికి ఎంతో మేలు జరుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్