బరువు తగ్గడం కష్టం కాదు!

నలభై ఏళ్ల వయసు... పెరుగుతోన్న ఆరోగ్య సమస్యలు... తగ్గుతున్న జీవక్రియల రేటు... హార్మోన్లలో హెచ్చుతగ్గులు...  ఇలాంటి సమయంలో మహిళలు బరువు తగ్గడం కాస్త ఇబ్బందే.. అయితే అసాధ్యమేమీ కాదంటున్నారు నిపుణులు..

Updated : 03 Jun 2021 01:54 IST

నలభై ఏళ్ల వయసు... పెరుగుతోన్న ఆరోగ్య సమస్యలు... తగ్గుతున్న జీవక్రియల రేటు... హార్మోన్లలో హెచ్చుతగ్గులు...  ఇలాంటి సమయంలో మహిళలు బరువు తగ్గడం కాస్త ఇబ్బందే.. అయితే అసాధ్యమేమీ కాదంటున్నారు నిపుణులు..
పండ్లు... కూరగాయలతో.. వీటిలో కెలొరీలు తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని సలాడ్ల రూపంలో తీసుకుంటూ ఉండాలి. వీటిలో పీచూ అధికమే. ఇవి తింటే పొట్ట నిండిన భావన కలిగి ఆకలి వేయదు. ఆహారంలో మాంసకృత్తులు, ప్రొటీన్‌ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. పాలు, పెరుగు, పప్పులను తీసుకోవాలి.
వేపుళ్లు నో నో! వీటిలో పెద్ద మొత్తంలో కొవ్వులుంటాయి. కాబట్టి వేయించిన పదార్థాలకు దూరంగా ఉండాలి. బదులుగా ఆవిరిపై ఉడికించిన వాటిని తీసుకోవాలి. ఉదాహరణకు బంగాళా దుంప వేపుడు బదులుగా దాన్ని ఉడికించి కూరలా తింటే తక్కువ కెలొరీలు వస్తాయి.
అల్పాహారం అత్యవసరం.. చాలామంది బ్రేక్‌ఫాస్ట్‌ను మానేయడమో లేదా ఆలస్యంగా తీసుకోవడమో చేస్తుంటారు. ఈ రెండూ సరికాదు. సమయానికి సరైన మోతాదులో బ్రేక్‌ఫాస్ట్‌ తప్పక చేయాలి. దీంట్లో మాంసకృత్తులు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
రాత్రి భోజనం? రాత్రి పూట ఏ సమయానికి తింటున్నారో... ఏం తింటున్నారో గమనించుకోవాలి. వీలైనంత మటుకు చాలా తేలికగా అరిగే ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి.  ఆహారాన్ని బాగా నమిలి మెల్లగా తినాలి. త్వరగా డిన్నర్‌ ముగించాలి. దానికీ, నిద్రకూ మధ్య కనీసం రెండు, మూడు గంటల వ్యవధి ఉంటే మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్