నోరూరించే మామిడిపండు

ఇది మామిడిపండ్ల సీజన్‌. చూపులకు ఎంత అందంగా ఉంటాయో అంతకంటే ఎక్కువగా నోరూరిస్తాయి. ఇవి రుచిగా ఉండటమే కాదు, అనేక విటమిన్లు, ఖనిజాలతో శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. రోజుకో పండు తిని ఆరోగ్యంగా ఉందాం...

Published : 03 Jun 2021 01:33 IST

ఇది మామిడిపండ్ల సీజన్‌. చూపులకు ఎంత అందంగా ఉంటాయో అంతకంటే ఎక్కువగా నోరూరిస్తాయి. ఇవి రుచిగా ఉండటమే కాదు, అనేక విటమిన్లు, ఖనిజాలతో శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. రోజుకో పండు తిని ఆరోగ్యంగా ఉందాం...
మామిడిలో పీచుపదార్థాలు అధికంగా ఉండటం వల్ల అజీర్ణ సమస్యలను నివారించి ఆహారం తేలిగ్గా అరిగేలా చేస్తుంది.
*ఇందులో బీటాకెరొటిన్‌, సి విటమిన్‌లు సమృద్ధిగా ఉంటాయి. ఈ పండువల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది.
* దీంట్లోని కాపర్‌ ఎర్రరక్త కణాలను వృద్ధి చేస్తుంది.
* పొటాషియం, మెగ్నీషియం విస్తారంగా ఉండటంవల్ల అవి రక్తపోటును నివారిస్తాయి.
* విటమిన్లతోపాటు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మెదడును ఆరోగ్యంగా, చురుగ్గా ఉంచుతాయి.
* ఐరన్‌ ఎక్కువగా ఉన్నందున రక్తహీనత తగ్గుతుంది.
* మామిడిపండ్లను తినడం వల్ల చర్మానికి కాంతి వస్తుంది. ముఖవర్ఛస్సు పెరుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్