ప్రేమ ఉండాలి కానీ..

పిల్లలను ప్రేమగా చూడాలి. వాళ్లకి కావల్సినవి అందిస్తూ, ఏ లోటూ లేకుండా చూసుకోవాలి.  అయినా సరే కొన్ని సరిహద్దులు ఉండాలి. ఎందుకంటే సరైన రీతిలో పెంచాల్సిన బాధ్యత అమ్మానాన్నలదే!

Published : 03 Jun 2021 01:51 IST

పిల్లలను ప్రేమగా చూడాలి. వాళ్లకి కావల్సినవి అందిస్తూ, ఏ లోటూ లేకుండా చూసుకోవాలి.  అయినా సరే కొన్ని సరిహద్దులు ఉండాలి. ఎందుకంటే సరైన రీతిలో పెంచాల్సిన బాధ్యత అమ్మానాన్నలదే!
పిల్లల్ని గారాబం చేయాలి. కానీ అది వాళ్లని సోమరిపోతుల్లా మార్చేలా ఉండకూడదు. చిన్నప్పటినుంచే వాళ్ల పనులు వాళ్లే సొంతంగా చేసుకునేలా అలవాటు చేయాలి.
* పెరిగే కొద్దీ స్వేచ్ఛ కల్పించాలి. మంచిదే! అది వాళ్లలోని పాజిటివ్‌ యాటిట్యూడ్‌ను పెంపొందిస్తుంది. కానీ అది వాళ్ల భవిష్యత్తును పాడుచేసేంత ఉండకూడదు. అందుకే ఓ కంట కనిపెడుతుండాలి. వాళ్ల కదలికల్ని గమనిస్తూ వాళ్ల దారి బాగుండేలా చూడాలి.
*ఆడుతూ పాడుతూ సరదాగా పెంచాలి. స్నేహపూరిత వాతావరణం కల్పించాలి. అయితే అలాగనీ వాళ్లని అలా వదిలేయమనికాదు. సరదాగా ఉంటూనే ఏ సమయాల్లో ఎలా ఉండాలో, ఎవరితో ఎలా ప్రవర్తించాలో, వాళ్ల బాధ్యతలేంటో తెలియజేయాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్