పాపకి తెల్లవెంట్రుకలు!

మా పాప వయసు మూడేళ్లు. తలలో రెండు, మూడు తెల్ల వెంట్రుకలు కనిపిస్తున్నాయి. ఇదేమైనా సమస్యా? తగ్గించగల...

Published : 06 Jun 2021 00:35 IST

మా పాప వయసు మూడేళ్లు. తలలో రెండు, మూడు తెల్ల వెంట్రుకలు కనిపిస్తున్నాయి. ఇదేమైనా సమస్యా? తగ్గించగల మార్గమేమైనా ఉందా?

- ఓ సోదరి, బోధన్‌

పిల్లల్లో కొన్ని వెంట్రుకల్లో మెలనిన్‌ పిగ్మెంట్‌ తక్కువగా ఉంటుంది. అలాంటి వారిలో తెల్ల వెంట్రుకలు కనిపి స్తుంటాయి. పిగ్మెంట్‌ మరీ తక్కువగా ఉంటే ఇంకా పెరిగే అవకాశమూ ఉంటుంది. ఇది వంశ పారంపర్యంగానూ వస్తుంది. పాప ఆరోగ్యం బాగుంటే కంగారుపడక్కర్లేదు. పేను కొరుకుడు పిల్లల్లో ఎక్కువగా చూస్తుంటాం! వాళ్లలో ప్యాచ్‌లుగా జుట్టు ఊడుతుంటుంది.  కొన్నిసార్లు అది తెల్లగా వస్తుంటుంది. విటమిన్‌ బి12 తగ్గినా ఈ సమస్య ఉంటుంది. ఇది చేపలు, మాంసం, పాలు, గుడ్లలో ఎక్కువగా ఉంటుంది. వీటిని బాగా ఇవ్వాలి. థైరాయిడ్‌ ఉందేమో కూడా చూసుకోవాలి. పిల్లల్లో కొంతమందిలో బొల్లి వస్తుంటుంది. ఇలాంటి వారిలోనూ తెల్లజుట్టు సమస్య ఉంటుంది. కానీ ఇది చాలా తక్కువ సందర్భాల్లోనే. ట్యూటరస్‌ క్లిరోసిస్‌, న్యూరో ఫైబ్రమాటోసిస్‌ వంటివీ వంశపారంపర్య వ్యాధులూ కారణమవుతాయి. ఫిట్స్‌, ట్యూమర్స్‌, వినికిడి సరిగా లేకపోవడం.. వంటివి ఇతర లక్షణాలు. ఇలాంటివేమీ కనిపించనప్పుడు కంగారుపడక్కర్లేదు.

రసాయనాలుండే షాంపూలను వాడొద్దు. పొగతాగే అలవాటున్నవాళ్ల వల్ల కూడా ఇది కనిపిస్తుంటుంది. వారికి దూరంగా ఉంచాలి. జంక్‌ఫుడ్‌, చాక్లెట్లు, కూల్‌డ్రింక్స్‌ ఎక్కువగా తీసుకునే వాళ్లలోనూ ఈ సమస్య కనిపిస్తుంటుంది. 100 మి.లీ కొబ్బరినూనెలో గుప్పెడు కరివేపాకు వేసి వేడిచేసి, గోరువెచ్చగా తలకు పట్టిస్తే జుట్టు నల్లబడుతుంది. కప్పు కొబ్బరినూనెకు రెండు టేబుల్‌ స్పూన్ల ఉసిరిపొడి, ఒక టేబుల్‌ స్పూన్‌ మెంతిపొడి కలిపి వేడిచేసి పెట్టొచ్చు. కప్పు నువ్వుల నూనెకు క్యారెట్‌ రసం, మెంతిపొడి కలిపి వేడిచేసి తలకు పెట్టినా ఫలితం ఉంటుంది. పిల్లల ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్స్‌, నికోటినమైన్‌, జింక్‌, కాపర్‌, ఐరన్‌ ఉండేలానూ చూసుకోవాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్