పింక్‌బూత్‌లు!

కొవిడ్‌ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడటానికి ప్రభుత్వాలు వ్యాక్సిన్‌నే ఆయుధంగా ఎంచుకున్నాయి. అందులో ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఓ అడుగు ముందుకు వేసి మహిళల వ్యాక్సినేషన్‌ కోసం

Published : 09 Jun 2021 00:39 IST

కొవిడ్‌ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడటానికి ప్రభుత్వాలు వ్యాక్సిన్‌నే ఆయుధంగా ఎంచుకున్నాయి. అందులో ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఓ అడుగు ముందుకు వేసి మహిళల వ్యాక్సినేషన్‌ కోసం రాష్ట్రంలోని 75 జిల్లాల్లో 150 పింక్‌ బూత్‌లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది.
ప్రతి జిల్లాలో మహిళల కోసం రెండు రకాల పింక్‌ బూత్‌లు పనిచేస్తున్నాయి. ఒకటి 18 - 44 ఏళ్ల మహిళల కోసం, మరొకటి 45, ఆపై వయసు వారి కోసం కేటాయిస్తున్నారు. ఈ శిబిరాలను జిల్లా మహిళా ఆసుపత్రులు, జిల్లా ఉమ్మడి ఆసుపత్రుల్లో ఏర్పాటు చేశారు. అవసరమైతే ఇలాంటి శిబిరాలను తాలూకాల్లోనూ ఏర్పాటు చేసుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఇంతకు ముందు మహిళల కోసం పింక్‌ స్టేషన్‌లను కూడా ఏర్పాటు చేసింది. వీటిలో సిబ్బంది మొత్తం మహిళా పోలీసులే కావడం విశేషం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్