ఆరోగ్యాన్నిచ్చే తులసి కషాయం!

కొవిడ్‌కు తోడు కాలమూ మారింది. వానలు మొదలయ్యాయి. వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారి గాలిలో తేమ పెరిగింది. ఈ కాలంలో జలుబు, దగ్గు లాంటివి సాధారణమే కానీ... ఈ మహమ్మారి

Published : 09 Jun 2021 00:39 IST

కొవిడ్‌కు తోడు కాలమూ మారింది. వానలు మొదలయ్యాయి. వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారి గాలిలో తేమ పెరిగింది. ఈ కాలంలో జలుబు, దగ్గు లాంటివి సాధారణమే కానీ... ఈ మహమ్మారి మాటు వేసిన వేళ ఆరోగ్యాన్ని మరింత భద్రంగా కాపాడుకోవాలి. రోగనిరోధక వ్యవస్థను పటిష్టపరచుకోవాలి. అందుకోసం ఈ ఔషధ గుణాలున్న కషాయాన్ని ప్రయత్నించండి.
కావాల్సినవి: నీళ్లు- మూడు గ్లాసులు, అల్లం ముక్క- చిన్నది, దాల్చిన చెక్క- అంగుళం ముక్క, తులసి ఆకులు-ఏడెనిమిది, సోంపు-చిటికెడు, తేనె-రుచికి సరి పడా, మిరియాలు -నాలుగైదు, పచ్చి పసుపు కొమ్ము- చిన్న ముక్క.
తయారీ: పొయ్యి మీద గిన్నెలో నీళ్లు మరుగుతున్నప్పుడే అల్లంముక్క, దాల్చిన చెక్క, తులసి ఆకులు, సోంపు, మిరియాలు, పసుపు కొమ్ము అన్నీ వేయాలి. అవి పావు కప్పు అయ్యేదాకా మరిగించాలి. ఈ నీటిని వడబోసుకుని కాస్త తేనె కలిపి వేడివేడిగా తాగితే సరి.

ప్రయోజనాలు: సహజసిద్ధమైన ఈ పదార్థాలన్నీ ఔషధ గుణాలున్నవి. వ్యాధి నిరోధకతను పెంచడంలో సాయపడతాయి. ఈ కషాయంతో జలుబు, దగ్గు, ఇతరత్రా కాలానుగుణ వ్యాధులను అడ్డుకోవచ్చు. దీన్ని మధుమేహులు కూడా తీసుకోవచ్చు. క్రమం తప్పక తీసుకుంటే జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. గ్యాస్‌, అజీర్తి, మలబద్ధకం.. లాంటి ఉదర సంబంధ సమస్యలూ తగ్గుముఖం పడతాయి. ఈ డికాషన్‌లో యాంటీబ్యాక్టీరియల్‌, యాంటీవైరల్‌ సమ్మేళనాలు మెండుగా ఉంటాయి. ఇవి గొంతు నొప్పి, గొంతు గరగరను తగ్గిస్తాయి. పసుపు మలినాలను తొలగించి రక్తాన్ని శుద్ధి చేస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్