బిడ్డకూ... మీకూ.. కలిపి!

ప్రసవమయ్యాక లావైపోతామనే భయంతో చాలామంది తినడం మానేస్తారు. ఇలా చేస్తే బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం  పడుతుందంటున్నారు వైద్యులు. ఎందుకంటే...

Published : 11 Jun 2021 02:04 IST

ప్రసవమయ్యాక లావైపోతామనే భయంతో చాలామంది తినడం మానేస్తారు. ఇలా చేస్తే బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం  పడుతుందంటున్నారు వైద్యులు. ఎందుకంటే... తల్లి తీసుకునే ఆహారం నుంచే పాపాయికి పోషకాలు అందుతాయి. మరి పాలిచ్చే వారు ఎలాంటి ఆహారం తినాలో తెలుసుకుందామా!

ఎక్కువ కెలొరీలు ఉండేలా...: స్తన్యమిచ్చే తల్లులకు అధికశక్తి అవసరం. అందుకే ఈ సమయంలో ఎక్కువ కెలోరీలుండే ఆహారాన్ని తీసుకోవాలి. రోజుకు కనీసం 300 నుంచి 350 కెలొరీలు కావాలి. పోషకవిలువలు ఎక్కువగా ఉండే తాజా పండ్లు, పాల ఉత్పత్తులు, కూరగాయలు, విత్తనాలు రోజూ ఆహారంలో ఉండేలా జాగ్రత్తపడాలి. చక్కెర, ఇన్‌స్టెంట్ పండ్ల రసాలు, తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి.

ప్రొటీన్లు పుష్కలంగా: ఆకుకూరలు, పప్పులు, గుడ్లు, చికెన్‌, మాంసం, చేప వంటి హైప్రొటీన్‌ ఫుడ్‌ తగినంతగా తీసుకోవాలి.

బీ12 అవసరం: శరీరానికి తగినంత శక్తిని అందించడంతో పాటు, శిశువు ఎదుగుదలలోనూ బీ12 కీలకంగా పనిచేస్తుంది. పాలిచ్చే తల్లికి ఇది చాలా ముఖ్యం. పాలు, చేప, గుడ్లు వంటి వాటిలో ఇది లభ్యమవుతుంది. మెంతికూర, మెంతులు, ఆకుకూరలు, వెల్లులి, అల్లం, యాలకులు వంటివి ఆహారంలో తప్పక ఉండాలి. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే పాలు  ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్