దిండ్లనూ ఉతకొచ్చు!

దుప్పట్లు, గలేబుల్ని ఉతుకుతాం. కానీ... తలగడలకి వచ్చేసరికి... ఉతికితే పాడవుతాయనే భయంతో సర్దుకుపోతాం. అయితే వీటిని ఎప్పటికప్పుడు శుభ్రపరచడం తప్పనిసరి అంటున్నారు వైద్యులు. అదెలా చేయాలంటే... దూదితో చేసినవి కాకుండా మిగిలిన రకాలను చక్కగా ఉతుక్కోవచ్చు. లేదంటే జిడ్డు, మురికి చేరి అనారోగ్యాలకు కారణం అవుతాయి....

Published : 12 Jun 2021 01:07 IST

దుప్పట్లు, గలేబుల్ని ఉతుకుతాం. కానీ... తలగడలకి వచ్చేసరికి... ఉతికితే పాడవుతాయనే భయంతో సర్దుకుపోతాం. అయితే వీటిని ఎప్పటికప్పుడు శుభ్రపరచడం తప్పనిసరి అంటున్నారు వైద్యులు. అదెలా చేయాలంటే...

దూదితో చేసినవి కాకుండా మిగిలిన రకాలను చక్కగా ఉతుక్కోవచ్చు. లేదంటే జిడ్డు, మురికి చేరి అనారోగ్యాలకు కారణం అవుతాయి. వీలైతే వాటిని ప్రతి పదిహేను రోజులకోసారి నాలుగైదు గంటల పాటు ఎండతగిలేలా ఉంచాలి.
వాషింగ్‌మెషీన్‌లో వీటిని వేస్తే లార్జ్‌లోడ్‌, హీట్‌ అనే ఆప్షన్‌ని ఎంచుకోవాలి. ఇందులో ముందుగా అరకప్పు బట్టల సోడా, లిక్విడ్‌ వేసుకోవాలి. ఇప్పుడు రెండు దిండ్లను మెషిన్‌లో అటొకటి ఇటొకటి పెడితే వాటి ఆకృతి చెడిపోకుండా ఉంటాయి. ఫ్యాబ్రిక్‌ కండిషనర్‌తో పాటు రెండు చుక్కల లావెండర్‌నూనె వేస్తే అవి ఆరాక సువాసన వెదజల్లుతాయి.
చేత్తో ఉతకాలనుకున్నప్పుడు గోరువెచ్చని నీళ్లల్లో కాస్త హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, వెనిగర్‌, సర్ఫ్‌ వేసి దిండ్లను ఓ పదినిమిషాలైనా నాననివ్వాలి. ఆపై మృదువుగా చేత్తో రుద్దితే... మురికీ, మరకలూ వదిలిపోతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్