హోమ్‌కేషన్‌ చేద్దాం...!

కరోనా వల్ల ఆఫీసులు, పిల్లల చదువులూ.. అన్నీ ఇంటి నుంచే. దీంతో ఇంటిల్లిపాదీ ఒత్తిడికి గురవుతున్నారు. ఈ పరిస్థితి నుంచి ఉపశమనానికి ఓ కొత్త ట్రెండ్‌ నడుస్తోంది. అదే హోమ్‌కేషన్‌. అంటే ఇంట్లోనే వెకేషన్స్‌ను ఆస్వాదించడం అన్నమాట. అదెలాగో చూద్దాం. ఇంటివెనుక కాస్తంత స్థలం లేదా పెరటి తోట అదీ లేదంటే టెర్రస్‌... ఎక్కడైనా సరే దీనికి ఏర్పాటు చేసుకోవచ్చు. రంగు రంగుల దుపట్టాలు, పాత చీరలతో ఓ టెంట్‌ ...

Published : 12 Jun 2021 01:10 IST

కరోనా వల్ల ఆఫీసులు, పిల్లల చదువులూ.. అన్నీ ఇంటి నుంచే. దీంతో ఇంటిల్లిపాదీ ఒత్తిడికి గురవుతున్నారు. ఈ పరిస్థితి నుంచి ఉపశమనానికి ఓ కొత్త ట్రెండ్‌ నడుస్తోంది. అదే హోమ్‌కేషన్‌. అంటే ఇంట్లోనే వెకేషన్స్‌ను ఆస్వాదించడం అన్నమాట. అదెలాగో చూద్దాం.

మూన్‌లైట్‌ డిన్నర్‌... ఇంటివెనుక కాస్తంత స్థలం లేదా పెరటి తోట అదీ లేదంటే టెర్రస్‌... ఎక్కడైనా సరే దీనికి ఏర్పాటు చేసుకోవచ్చు. రంగు రంగుల దుపట్టాలు, పాత చీరలతో ఓ టెంట్‌ తయారు చేయండి. దాని లోపల, బయట, చుట్టుపక్కల ఇండోర్‌ మొక్కలను, పూలతొట్టెలను పెట్టండి. వేర్వేరు కలర్‌ క్యాండిల్స్‌ వెలిగించండి. ఆహార పదార్థాలు సిద్ధం చేసుకుని, ఫోన్‌ గ్యాడ్జెట్స్‌ని దూరం పెట్టి... అక్కడే కుటుంబమంతా కలిసి కబుర్లు చెప్పుకోండి. ఫొటోలు తీసుకోండి. ఆ అనుభవమే కొత్తగా ఉంటుంది.
మూవీ నైట్‌... ఇంట్లో ఓ పెద్ద గదిని సినిమా థియేటర్‌గా మార్చేసుకోండి. వారాంతంలో అందరికీ నచ్చే ఓ రోజుని ఇందుకు ఎంచుకోండి. మధ్యలో తినడానికి స్నాక్స్‌నూ సిద్ధం చేసుకోవాలి. ఇది అందరిలో మంచి రిలీఫ్‌ను తెస్తుంది. అప్పుడప్పుడూ ఇలా చేస్తే కుటుంబమంతా ఒకచోట కూర్చుని సంతోషంగా గడిపినట్లు అవుతుంది.
ప్రత్యేకంగా... వారాంతాన్ని ప్రత్యేకంగా మార్చుకోవచ్చు. అదెలాగంటే అందరూ ప్రత్యేకంగా దుస్తులు ధరించాలనే నియమం పెట్టాలి. ఇంట్లోనే ఓ ఫ్యాషన్‌ షోలాంటిది ఏర్పాటు చేసి చిన్న పోటీ పెట్టాలి. దానికి బహుమతులను కూడా ఇవ్వాలి. అలాగే ప్రతి ఒక్కరూ వారి సృజనాత్మకతను ప్రదర్శించాలి. కథలు చెప్పడం, పాటలు పాడటం, డ్యాన్స్‌, యాక్షన్‌... వంటివన్నీ ప్రదర్శించేలా ఉత్సాహపరచాలి. ఇవన్నీ కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్