కళ్లకి కీరా!

ఒత్తిడి, నిద్రలేమి, హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలెన్నో కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడేలా చేస్తాయి. ఇలాంటప్పుడు మీ కళ్లను మెరిపించే చిట్కాలివి. టీస్పూన్‌ టొమాటో, కీరదోస రసంలో చెంచా నిమ్మరసం, కొద్దిగా తేనె కలిపి కళ్ల కింద రాసుకోవాలి. ఇలా రోజూ చేస్తే క్రమంగా సమస్య దూరమవుతుంది....

Published : 12 Jun 2021 01:15 IST

ఒత్తిడి, నిద్రలేమి, హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలెన్నో కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడేలా చేస్తాయి. ఇలాంటప్పుడు మీ కళ్లను మెరిపించే చిట్కాలివి.

టీస్పూన్‌ టొమాటో, కీరదోస రసంలో చెంచా నిమ్మరసం, కొద్దిగా తేనె కలిపి కళ్ల కింద రాసుకోవాలి. ఇలా రోజూ చేస్తే క్రమంగా సమస్య దూరమవుతుంది.
సమపాళ్లల్లో కీరా-బంగాళాదుంప రసం తీసుకుని అందులో కాసిన్ని పాలు, తేనె కలపండి. అందులో దూదిని ముంచి రోజూ మూడు నాలుగు సార్లు కంటిచుట్టూ మృదువుగా రుద్దండి. ఇలా ఓ వారం చేస్తే ఫలితం ఉంటుంది.
చెంచా తులసి ఆకు ముద్దకు కాసిన్ని పాలు, కీరా రసం కలిపి కళ్లకింద రాస్తే నలుపుదనం తగ్గుతుంది. గులాబీరేకల ముద్దకు చెంచా తేనె, తెల్లసొన చేర్చి ప్యాక్‌లా వేస్తే చాలు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్