ఆరోగ్యానికి ఈ నాలుగు!

అన్ని వయసుల మహిళలు ఈ నాలుగు వ్యాయామాలను చేస్తూ ఆరోగ్యాన్ని పొందవచ్చు. దీనికి పది నిమిషాల నుంచి అరగంట వరకూ వెచ్చిస్తే చాలు..

Published : 14 Jun 2021 17:43 IST

అన్ని వయసుల మహిళలు ఈ నాలుగు వ్యాయామాలను చేస్తూ ఆరోగ్యాన్ని పొందవచ్చు. దీనికి పది నిమిషాల నుంచి అరగంట వరకూ వెచ్చిస్తే చాలు..

నడక: కొత్తగా వ్యాయామం చేయాలనుకునే వారు, ఊబకాయులు, బిజీగా ఉండేవారు... ఇలాంటి వారికి నడక చక్కటి ఎక్సర్‌సైజ్‌. దీనివల్ల శరరీంపై ఎక్కువ ఒత్తిడి పడదు. వారంలో రెండున్నర గంటలు నడవడం వల్ల గుండె జబ్బులు 30 శాతం తగ్గుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. రోజూ నడిస్తే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. షుగరు వచ్చే ప్రమాదం కూడా తక్కువే.

స్క్వాట్స్‌... ఏ పరికరమూ లేకుండా వ్యాయామం చేయాలనుకునే వారు నడకతో పాటు స్క్వాట్స్‌ను ఎంచుకోవచ్చు. ఇది నడుము కింది భాగానికి చక్కటి వ్యాయామం అందిస్తుంది. పొట్ట, నడుము కండరాలను బలంగా మారుస్తుంది.

పుషప్స్‌... కండరాలకు వ్యాయామం అందించడమే కాదు... శరీరానికి చక్కటి ఆకృతినీ ఇస్తాయివి.

ప్లాంక్‌... ఎక్కువసేపు కూర్చొని పని చేసేవారు మీ వర్కవుట్స్‌లో దీన్ని చేర్చుకోవాల్సిందే. వెన్నునొప్పిని తగ్గిస్తుంది. పొట్ట కండరాలు, మెడ, వెన్ను, తొడలు, కాళ్లు... ఇలా అన్నింటినీ దృఢంగా మారుస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్