నగల వగలకు రక్షణ

అందాన్ని పెంచే బంగారు ఆభరణాలను మెరిసేలా ఉంచుకోవాలి. రోజూ ధరించే గొలుసులు, ఉంగరాలు, గాజులకు చెమట, మురికి అంటుకుంటాయి.

Published : 17 Jun 2021 01:29 IST

అందాన్ని పెంచే బంగారు ఆభరణాలను మెరిసేలా ఉంచుకోవాలి. రోజూ ధరించే గొలుసులు, ఉంగరాలు, గాజులకు చెమట, మురికి అంటుకుంటాయి. డిజైన్లలోకి దుమ్ము, ధూళి చేరుకుంటాయి. దీంతో అవి సహజ మెరుపును కోల్పోతాయి. కనీసం రెండు నెలలకొకసారి వీటిని శుభ్రం చేసుకుంటే మంచిది. కొన్ని నగలను పండుగలు, శుభకార్యాలకు మాత్రమే వాడుతుంటాం. బాక్సులోనే ఎక్కువ రోజులుంచినా, మురికి పట్టినట్లుగా మారతాయి. బంగారు దుకాణానికి తీసుకెళ్లి పాలిష్‌ పెట్టించడం కన్నా, ఇంట్లోనే వీటిని శుభ్రం చేసుకోవచ్చు.

షాంపుతో... చిన్న బౌల్‌లో గోరువెచ్చని నీటిని తీసుకుని రెండు చుక్కల షాంపు లేదా డిష్‌ డిటర్జెంట్‌ను వేసి బాగా కలపాలి. ఇందులో నగలను మునిగేలా పావుగంట ఉంచాలి. తర్వాత టూత్‌బ్రష్‌తో మృదువుగా రుద్దాలి. తర్వాత మంచినీటిలో రెండుసార్లు శుభ్రపరిచి పొడివస్త్రంలో వేసి మునివేళ్లతో అద్దాలి. తడి ఆరనిచ్చి, భద్రపరుచుకోవాలి. నాలుగు చెంచాల చిక్కటి కుంకుడు రసాన్ని ఓ గిన్నెలో తీసుకుని, అందులో నగలను పావుగంట ఉంచినా చాలు. డిజైన్లు, రాళ్లు దగ్గర చేరుకున్న మురికి ఆ రసంలోకి దిగుతుంది. తర్వాత నగలను అందులోనే ఉంచి బ్రష్‌తో మృదువుగా రుద్ది, మంచినీటిలో రెండు మూడుసార్లు కడిగితే చాలు. తడి ఆరనిచ్చి పొడి వస్త్రంలో భద్రపరిస్తే మంచిది.

కెంపులు, వజ్రాల నగలను... అరగ్లాసు నీటిలో చెంచా డిష్‌ సోప్‌ సొల్యూషన్‌ను వేసి బాగా కలపాలి. ఇందులో ముంచిన మృదువైన చిన్న వస్త్రంతో ఈ నగలపై మెల్లగా రుద్దాలి. రాళ్లపక్కన మురికి పోయేవరకు చేసి వాటిని మంచినీటిలో కడగాలి. ఇది చాలా సున్నితంగా చేస్తేనే రాళ్లు తొలగకుండా ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్