తన కష్టాన్ని మరచి సేవ
రోజీ సల్దానా కుటుంబం ముంబయిలోని మలావి చర్చ్ ప్రాంతంలో ఉంటోంది. యాభై ఒక్క ఏళ్ల రోజీ సెయింట్ జేవియర్ స్కూల్లో టీచర్. ఆమె భర్త పాస్కల్ ఆ దగ్గర్లోనే ఓ పూల దుకాణాన్ని నిర్వహిస్తుంటాడు. పెళ్లిళ్లు, స్కూల్లో వార్షికోత్సవాలకు పూలతో డెకరేషన్లు చేస్తుంటాడు.
సాయం చేయాలన్న మనసు ఉండాలే కానీ... పేదరికం, అనారోగ్యం ఏవీ ఆటంకాలు కావని నిరూపిస్తోంది రోజీ సల్దానా...
రోజీ సల్దానా కుటుంబం ముంబయిలోని మలావి చర్చ్ ప్రాంతంలో ఉంటోంది. యాభై ఒక్క ఏళ్ల రోజీ సెయింట్ జేవియర్ స్కూల్లో టీచర్. ఆమె భర్త పాస్కల్ ఆ దగ్గర్లోనే ఓ పూల దుకాణాన్ని నిర్వహిస్తుంటాడు. పెళ్లిళ్లు, స్కూల్లో వార్షికోత్సవాలకు పూలతో డెకరేషన్లు చేస్తుంటాడు. వారికి ఇద్దరు పిల్లలు. ఆ అందమైన కుటుంబాన్ని చూసి దేవుడికి కన్నుకుట్టిందేమో.. వారి సంతోషాలకు అడ్డుకట్ట వేశాడు. ఆమె మూత్రపిండాల సమస్యతో బాధపడటం మొదలైంది అయిదేళ్ల కిందటి నుంచే. సాఫీగా సాగిపోతున్న ఆ కుటుంబాన్ని ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలు చుట్టుముట్టాయి. రోజీకి డయాలసిస్ చేయిస్తేగాని బతకని పరిస్థితి. ‘ఏడాదిగా డయాలసిస్ చేయించుకుంటున్నా. 68 కిలోల నా బరువు 28కి పడిపోయింది. మంచానికే పరిమితమైపోయా. లేచి నాలుగడుగులు వేస్తే ఆ రోజు నరకమే. నాడి కొట్టుకోవడం తగ్గిపోయి కింద పడిపోయేదాన్ని. రోగనిరోధకతా తగ్గిపోయింది. దాంతో రకరకాల అనారోగ్యాలు చుట్టు ముట్టాయి. ఎన్నోసార్లు పక్షవాతం పలకరించింది. రక్తం గడ్డకట్టుకు పోవడంతో కొన్నాళ్లు కోమాలో ఉండిపోయా. మావారు, పిల్లలు నన్ను కంటికి రెప్పలా చూసుకోవడం మొదలుపెట్టారు. నాకు కావాల్సిన అత్యవసర వైద్య పరికరాలు, మందులు, అన్నింటినీ అందుబాటులో పెట్టే వారు. అలానే శ్వాస అందక ఇబ్బంది పడుతున్నప్పుడు ఆక్సిజన్ సిలిండర్లను తెచ్చిపెట్టారు’ అని వివరించింది రోజీ. ఇంతగా అనారోగ్యం బాధిస్తున్నా ఆమె మనసు మాత్రం ఎప్పుడూ పేదలకు, అవసరమైన వారికి సాయం చేయాలని ఆశపడేది. ప్రస్తుతం కొవిడ్ కోరలు చాస్తోంది. దాని ధాటికి తట్టుకోలేక చాలామంది ప్రాణాలు వదులుతున్నారు. ఊపిరి అందక ఎందరి ప్రాణాలో పోతున్నాయి. అలాంటి వారికి సాయం చేయాలనుకుందామె. భర్తకు తెలిసిన వారు ఆక్సిజన్ సిలిండర్లు కావాలని అడిగితే తన ఆరోగ్యం గురించి ఆలోచించకుండా అడగ్గానే వాటిని వారికి అందజేసింది. అప్పుడే ఆమెకు ఓ ఆలోచన వచ్చింది. తను ఈ జబ్బుతో ఎన్నాళ్లో బతకదు. ఉన్నన్ని రోజుల్లో వీలైనంత మందికి సాయం చేయాలనుకుంది. ముఖ్యంగా కొవిడ్‌తో బాధపడుతోన్న వారికి అండగా నిలవాలనుకుంది. తన నగలను అమ్మి వచ్చిన ఎనభై వేల రూపాయలతో ఆక్సిజన్ సిలిండర్లను కొనుగోలు చేయించింది. వీటిలో ఆక్సిజన్‌ను నింపి కావాల్సిన వారికి అందించే బాధ్యతను భర్త, పిల్లలకు అప్పజెప్పింది. అప్పటి నుంచి వారు దీన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు.
ఆమెకు ఇప్పటికీ వైద్యానికీ, మందులకూ బాగానే ఖర్చవుతుంది. అనారోగ్యంతో బాధపడుతోన్న ఆమె కడసారి కోరిక తీర్చాలని కుటుంబ సభ్యులు... ఇలా కొవిడ్ రోగులకు సాయం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- అమ్మో.. లిప్‌స్టిక్!
- ఫ్రిల్స్లో... బుట్టబొమ్మ!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
ఆరోగ్యమస్తు
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- ఇలా చేస్తున్నారా..!
- గుడ్డుకి బదులుగా..!
- నడకతో ఆల్జీమర్స్ పసిగట్టొచ్చు...!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
అనుబంధం
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- అతను తగినవాడేనా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
యూత్ కార్నర్
- ఆమె తిట్లకు ఏడ్చేశా..!
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- అందుకే వీళ్ల ఎంగేజ్మెంట్ రింగ్స్.. ఎంతో స్పెషల్!
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...